Site icon NTV Telugu

Nani : 50 కోట్ల మార్క్ దాటేసి హ్యాట్రిక్ కొట్టిన నాని

Saripodhaa Sanivaaram

Saripodhaa Sanivaaram

Saripodhaa Sanivaaram crossed the ₹50 crore mark : నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ లభించింది. సినిమా లైన్ మొత్తం ముందే చెప్పేసి ధియేటర్లకు రప్పించిన సినిమా యూనిట్ ని ప్రేక్షకులు అభినందిస్తున్నారు. ఇక డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డీవీవీ దానయ్యతో పాటు ఆయన కుమారుడు దాసరి కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాకు వసూళ్ల వర్షం కురుస్తోంది.

Radhika: కారవాన్లో సీక్రెట్ కెమెరాలు.. రాధిక ఆరోపణలపై పోలీసులు సీరియస్?

ఈరోజు మూడవరోజు వసూళ్లతో కలిపి ఈ సినిమా 50 కోట్ల రూపాయల కలెక్షన్లు దాటేసిందని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు వర్షాల్లో కూడా సినిమా చూసేందుకు థియేటర్లకు ప్రేక్షకులు కదిలి వస్తున్నారని సినిమా యూనిట్ చెబుతోంది. ఇక ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సూపర్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ కనిపిస్తోందని చెబుతున్నారు. ఇక ఈ క్రమంలోనే నానికి హ్యాట్రిక్ 50 కోట్ల గ్రాసర్ గా నిలిచిందని ఎందుకంటే దసరా , హాయ్ నాన్న సినిమాలు కూడా 50 కోట్లు కలెక్షన్లు పైగానే రాబట్టాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా ఆ లిస్టులో చేరడంతో నాని 50 కోట్ల గ్రాస్ హ్యాట్రిక్ కొట్టాడని అంటున్నారు.

Exit mobile version