NTV Telugu Site icon

Nathanadhudu : భీముడి వారసుడు నాథనాధుడిగా శరత్ కుమార్ లుక్ చూశారా?

Nathanathudu

Nathanathudu

Sarath Kumar Look as Nathanadhudu from the world of Kannappa: విష్ణు మంచు ‘కన్నప్ప’ ప్రాజెక్ట్ మీద దేశ వ్యాప్తంగా ఆసక్తి ఏర్పడింది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌ మీద ట్రోల్స్ వచ్చినా కన్నప్ప సినిమా ఎలా ఉంటుందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ గురించి అందరూ మాట్లాడుకునేలా ఉండబోతోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక కన్నప్ప ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్న క్రమంలో తాజాగా కన్నప్ప విడుదల గురించి విష్ణు మంచు మరోసారి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. కన్నప్ప చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేస్తామని ఇది వరకే ప్రకటించారు. తాజాగా మరోసారి ఈ విషయాన్ని విష్ణు మంచు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. కన్నప్ప ఈ ఏడాది డిసెంబర్‌లోనే వస్తుందని విష్ణు మంచు చెప్పేశారు. ప్రస్తుతం విష్ణు మంచు ట్వీట్ నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది.

Vijay: త్రిష, రంభలతో విజయ్.. అసలు మ్యాటర్ ఇదా?

ఇదిలా ఉండగా ఇప్పుడు శరత్ కుమార్ తాజాగా పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ఆయన నాథనాధుడిగా కనిపించనున్నారు. భీముడు-హిడింబి వారసులుగా ఉన్న కోయల పెద్దగా ఆయన కనిపిస్తున్నారు. కోయల దొరగా కనిపిస్తూ ఉన్నారు. ఇక అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఈ చిత్రాన్ని పద్మశ్రీ డా.మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టీఫెన్ దేవస్సీ సంగీతాన్ని అందిస్తున్నారు. విజువల్ ట్రీట్ ఇచ్చేలా, ఇండియన్ స్క్రీన్ మీద మునుపెన్నడూ చూడనటువంటి గ్రాండియర్‌తో కన్నప్ప చిత్రం రానుంది. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్ వంటి భారీ తారగణంతో తెరకెక్కిన ఈ చిత్రం నుంచి ఇక కంటిన్యూగా అప్డేట్లు రానున్నాయి.

Show comments