Sara Arjun: సారా అర్జున్‌కు బంపర్ ఆఫర్.. మ్యూజికల్ లవ్‌స్టోరీలో ఛాన్స్.. హీరో ఎవరంటే?

Sara Arjun New Movie

Sara Arjun New Movie

Sara Arjun New Movie: ‘ధురంధర్’ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న యువ నటి సారా అర్జున్.. ఇప్పుడు బాలీవుడ్‌లో వరుస అవకాశాలను అందుకుంటున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్‌గా తొలి అడుగులోనే భారీ విజయాన్ని అందుకోవడంతో ఆమెకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో తదుపరి ప్రాజెక్టుల ఎంపిక విషయంలో సారా ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. అందుకే ‘ధురంధర్ 2’ విడుదలై ఎనిమిది నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకు ఈ యంగ్ బ్యూటీ కొత్త సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడలేదు.

గత కొంతకాలంగా ప్రముఖ నటి మధుబాల బయోపిక్‌లో సారా అర్జున్ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్టుపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు టాలీవుడ్‌లోనూ సారా పేరు వినిపిస్తోంది. గతంలో ‘యుఫోరియా’ సినిమాలో మైనర్ బాలిక పాత్రలో కనిపించిన ఆమె.. ఇప్పుడు హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం కావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. రామ్ చరణ్ తదుపరి చిత్రం ఆర్సీ17 కోసం సారా ఆడిషన్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పాత్రకు సారాను ఎంపిక చేయాలా? లేక సాత్విక వీరవల్లాను తీసుకోవాలా? అనే విషయంలో మేకర్స్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం.

ఈ ప్రాజెక్టులపై చర్చలు కొనసాగుతుండగానే.. సారా మరో బాలీవుడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఆమెను తమ తదుపరి చిత్రంలో కథానాయికగా ఎంపిక చేసినట్లు బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది ‘సైయారా’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ సంస్థ.. మరో మ్యూజికల్ లవ్‌స్టోరీని రూపొందించేందుకు సిద్ధమవుతోందట. ఈ చిత్రంలో అంబరీష్ వర్మ హీరోగా నటించనున్నట్లు సమాచారం. దర్శకుడు మనీష్ శర్మ ఈ ప్రాజెక్టును తెరకెక్కించనున్నారని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని టాక్. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది జనవరి నుంచి సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే సారా ఎంపికపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.