NTV Telugu Site icon

Sara Ali Khan : ఆధ్యాత్మిక యాత్రలో బాలీవుడ్ బ్యూటి..చార్ ధామ్ టూర్ లో సారా..

Saraaa (2)

Saraaa (2)

సారా అలీఖాన్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బాలివుడ్ ముద్దుగుమ్మ సినిమాలు, యాడ్ లతో బాగానే సంపాదిస్తుంది.. సైఫ్ అలీఖాన్ వారసురాలుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కూడా తన నటన టాలెంట్ తో అందరిని ఆకట్టునకుంది.. దాంతో సినిమా ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చాయి.. ప్రస్తుతం రెండు చేతులా సంపాదిస్తూ బిజీగా ఉంది.. ఫ్యాషన్‌లోనూ ఆ స్టార్‌ స్టయిల్‌ సెపరేటే.. ఇక సారా ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలో ఉందని తెలుస్తుంది.. చార్ ధామ్ యాత్రలో ఉన్న సారా ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

సారా అలీ ఖాన్ ఆధ్యాత్మిక యాత్రలో మునిగితేలుతోంది. భక్తి పారవశ్యంలో తేలుతోంది బ్యూటీ.. ఇటీవల సారా ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రమేన కేదార్‌నాథ్‌కు వెళ్లొచ్చింది. హిమాలయ పర్వత సానువుల్లోని ఎత్తైన కొండ దారిలో నడుచుకుంటూ వెళ్లి కేదార్‌నాథీశ్వరుడిని దర్శించుకుంది.. ఎంతో కష్టమైన, అందరు మెచ్చే చార్‌ధామ్ యాత్రను.. సారా అలీ ఖాన్ పూర్తి చేశారు. ఈ టూర్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సారా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. సారా సంగీతం వింటూ ట్రెక్కింగ్ చేస్తున్న దృశ్యాలు, బండరాయి మీద ధ్యాన ముద్రలో ఉన్న ఫొటోలు, సాధువు ఆమెను ఆశీర్వదిస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఈ యాత్రను తన ఫ్రెండ్స్ తో కలిసి చేసినట్లు ఉంది..

ఈ అమ్మడు గతంలో ఓసారి కేదార్‌నాథ్కు వెళ్లింది.. తన మొదటి సినిమా షూటింగ్ అక్కడే జరిగింది.. ఇక్కడ ప్రతీ విషయం ఆమెకు తెలుసు. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌, సారా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మంచి వసూళ్లు కూడా సాధించింది. కేదార్ నాధ్ సినిమా తరువాత సారా అలీఖాన్ .. లవ్ ఆజ్ కల్‌, లూకా చిప్పి, జరా హట్కే జరా బచ్‌కే వంటి సినిమాల్లో నటించింది. బాలీవుడ్ స్టార్‌ హీరో సైఫ్ అలీ ఖాన్‌, అమృతా సింగ్ కుమార్తె సారా.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది..