NTV Telugu Site icon

Saptagiri: సప్తగిరి అత్యుత్సాహం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

Saptagiri

Saptagiri

చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో జరుగుతున్న శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర ఒక అపశృతితో వార్తల్లో నిలిచింది. ఈ ప్రముఖ జాతరలో భక్తులు అమ్మవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో తరలివచ్చిన సమయంలో, టీడీపీ నాయకుడు ఆర్వీటి బాబు, సినీ నటుడు, కమెడియన్ సప్తగిరి హెలికాప్టర్ ద్వారా ఆలయం పై పూలు చల్లే ప్రయత్నం చేశారు. అయితే, ఈ ప్రయత్నం భక్తులకు తీవ్ర ఇబ్బందులను కలిగించడమే కాకుండా, ఒక పెను ప్రమాదాన్ని త్రుటిలో తప్పించింది. జాతర సందర్భంగా హెలికాప్టర్ ద్వారా పూలు చల్లడానికి ఆర్వీటీ బాబు, సప్తగిరి ఉన్న హెలికాప్టర్ కిందికి దిగడంతో, దాని గాలి వల్ల షామియానాలు కూలిపోయాయి. ఈ ఘటనలో దుమ్ము దూళి రేగడంతో భక్తులు శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడ్డారు. ఈ అత్యుత్సాహ చర్య వల్ల కూలిన షామియానాల కింద ఎవరైనా చిక్కుకుని ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Naga Vamsi : చిన్న సినిమాలను తొక్కేస్తున్నారు.. నాగవంశీ సెన్సేషనల్..

“అమ్మవారి దర్శనం కోసం వచ్చిన మాకు ఇలాంటి ఇబ్బందులు ఎందుకు? ఇక్కడ వృద్ధులు, చిన్నపిల్లలు ఉన్నారు. ఇది ఏమైనా అవసరమా?” అని పోలీసులను నిలదీస్తూ ప్రశ్నించారు. షామియానాలు కూలిన సమయంలో ఎవరూ గాయపడకపోవడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పినప్పటికీ, ఈ ఘటన భక్తుల్లో భయాందోళనలను రేకెత్తించింది. గంగమ్మ జాతర వంటి పవిత్ర కార్యక్రమంలో ఇటువంటి గందరగోళం సృష్టించడం పట్ల భక్తులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు. దీంతో కోపోద్రిక్తులైన భక్తులు పోలీసులను నిలదీశారు. “అమ్మవారి దర్శనం కోసం వచ్చాము, ఇదేమి పరిస్థితి? ఇలా ఎందుకు చేస్తున్నారు? ఇది అవసరమా? ఇక్కడ వృద్ధులు, చిన్న పిల్లలు ఉన్నారు. పందిళ్ల కూలిపోయి పైపులు ప్రజలపై పడి ఉంటే ఏం జరిగేది? పోలీసులు ఊరికే చూస్తూ ఉంటే సరిపోతుందా?” అని ప్రశ్నించారు. ఈ ఘటనలో తృటిలో పెను ప్రమాదం తప్పడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.