Site icon NTV Telugu

Santosh Sobhan New Movies: లైన్‌లో నాలుగు సినిమాలు.. సంతోష్ ‘బాబు’ బాగా బిజీ!

Santosh Sobhan

Santosh Sobhan

Santosh Sobhan Upcoming Films: టాలీవుడ్ యువ హీరో సంతోష్ శోభన్ 2023 తర్వాత కొంతకాలం విరామం తీసుకున్నప్పటికీ.. ఇప్పుడు మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చారు. ఇటీవల విడుదలైన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో.. ఆయన కెరీర్‌కు కొత్త ఊపు వచ్చింది. ఈ చిత్రం ఆయన కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సక్సెస్‌తో సంతోష్ మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు.

కపుల్ ఫ్రెండ్లీ ప్రమోషన్ల సమయంలో చెప్పినట్లుగానే సంతోష్ శోభన్ వరుస ప్రాజెక్ట్‌లతో బిజీ అవుతున్నారు. ఇప్పటికే నాలుగు సినిమాలను లైన్‌లో పెట్టారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ బ్యానర్‌లో మల్టీ యూనివర్స్ కామెడీ సినిమా చేయడానికి సిద్ధమవ్వడం అభిమానుల్లో భారీ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సినిమాకు లక్షణ్ కే కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు రామ్ పసుపులేటి దర్శకత్వంలో ఒక ఫాంటసీ అడ్వెంచర్ మూవీ చేయడానికి కూడా సిద్ధమయ్యారు.

అంతేకాకుండా మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు సమాచారం. విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంతోష్ శోభన్ కొత్త కాన్సెప్ట్ కథలను ఎంపిక చేసుకుంటున్నారు. బ్రేక్ తర్వాత సంతోష్ కెరీర్ కొత్త స్పీడ్ అందుకుంది. వరుస ప్రాజెక్ట్‌లతో ఆయన అభిమానులకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కపుల్ ఫ్రెండ్లీ విజయంతో సంతోష్ నుంచి వచ్చే సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version