Site icon NTV Telugu

Sankranti 2025 : సంక్రాంతి రేస్ నుండి తప్పుకున్న బాలయ్య – చిరు..?

Untitled Design (13)

Untitled Design (13)

2025 సంక్రాంతికి మరోసారి థియేటర్ల పంచాయితీ తప్పేలా లేదు. ఇప్పటికే పలు స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతి రిలీజ్ కు వస్తున్నామని ప్రకటించారు. వీటిలో మెగాస్టార్ చిరంజీవి యంగ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న విశ్వంభర అందరికంటే ముందుగా వచ్చే ఏడాది పొంగల్ రిలీజ్ అని ప్రకటించారు. ఇక పొంగల్ కు వస్తున్న మరో స్టార్ వెంకీ, అనిల్ రావిపూడి ‘ సంక్రాంతికి వస్తున్నాం’ పొంగల్ రిలీజ్ కు జెట్ స్పీడ్ లో రెడీ అవుతోంది. ఇక బాబీ – బాలయ్య సినిమా కూడా సంక్రాంతి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్.

Also Read : Devara collections : దేవర DAY -2 ఏపీ – తెలంగాణ కలెక్షన్స్.. బ్లాక్ బస్టర్

వీటితో పాటుగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానేర్ లో రవితేజ నటించే సినిమా,అలాగే అక్కినేని నాగార్జున బంగార్రాజు -3 కూడా ఫెస్టివల్ రేస్ లో ఉన్నాయి. ఇవి చాలవన్నట్టు సందీప్ కిషన్, త్రినాధ్ రావ్ నక్కిన దర్శకత్వంలో వస్తున్న ‘మజాకా’ కూడా పొంగల్ రేస్ లో ఉంది. తాజగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం చిరు విశ్వంభర సంక్రాంతికి వచ్చేలా లేదని తెలుస్తోంది. ఆ డేట్ ను చిరు తనయుడు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కు కేటాయించాలని చూస్తున్నట్టు టాలీవుడ్ ఇన్ సైడ్ టాక్. ఇక పొంగల్ రేస్ నుండి తప్పుకున్న మరో హీరో నందమూరి బాలకృష్ణ. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైనమెంట్స్ నిర్మిస్తోంది. ఒకే బ్యానేర్ నుండి రెండు సినిమాలు అంటే థియేటర్ల కేటాయింపు సమస్య వస్తుంది. గేమ్ ఛేంజర్ సంక్రాంతికి వస్తే ఆ సినిమా ముందుగా అనుకున్న డేట్ డిసెంబరు 20న విడుదల చేయాలి అని చూస్తున్నారు మేకర్స్..

Exit mobile version