సంక్రాంతి బరిలో ఉన్న చిత్రాలలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఒకటి. వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి కాంబినేషన్ తో తెరకెక్కిన ఈ మూవీ జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు , శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ లభించగా, విడుదల సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ లు కూడా జోరుగా చేస్తున్నారు మూవీ టీం. ముఖ్యంగా వెంకీ మామ బుల్లితెర పై ప్రతి ఒక షో లో అలరిస్తున్నాడు.
Also Read : Darling : ప్రభాస్ పెళ్లి చేసుకోబోయేది ఆ అమ్మాయినేనట
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా రన్‌టైమ్‌ను మేకర్స్ లాక్ చేశారు. మొత్తం 2 గంటల 22 నిమిషాల షార్ప్ రన్ టైమ్ ఫిక్స్ చేశారట మేకర్స్. కమర్షియల్ చిత్రానికి ఇది పర్ఫెక్ట్ రన్‌టైమ్ అని చెప్పోచ్చో. ఇక అనిల్ రావిపూడి మూవీ అంటే కామెడి మాములుగా ఉండదు ఆడియెన్స్‌కు ఏమాత్రం బోర్ కొట్టకుండా కంటెంట్ ఉన్న మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం. కానీ ఈ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా మరో రెండు సినిమాలతో పోటీ పడుతుండటంతో ఈ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అని వెంకిమామ అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. నేడు ఈ సినిమా మ్యూజికల్ నైట్ ను అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ యూనిట్ ఈ వేడుకలో పాల్గొని డాన్స్ లతో ఆడిపాడనుంది.