Site icon NTV Telugu

Sankranthiki Vasthunam: షాకింగ్: మీడియా ముందుకు సంక్రాంతికి వస్తున్నాం బయ్యర్లు

Sankranthikivasthunam

Sankranthikivasthunam

టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ మొదలైంది. నిజానికి టాలీవుడ్ లో పార్టీలు ఇచ్చుకోవడం కొత్త కాదు సినిమా సక్సెస్ అయిన సందర్భంగా నిర్మాతలు నటీనటులకు, దర్శకుడికి ఇతర టెక్నీషియన్లకి పార్టీలు ఇస్తూ ఉంటారు. ఒక్కోసారి హీరోలు దర్శకుడు సహా నిర్మాత ఇతర టీం మెంబెర్స్ కి ఇస్తూ ఉంటారు. అడపాదడబా హీరోయిన్లు కూడా పార్టీలు ఇస్తున్న వైనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఒక కొత్త సంస్కృతికి డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు తెరలేపారు. అదేంటంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా బయర్లు అంతా కలిసి సినిమా యూనిట్ కి రేపు పార్టీ ఇవ్వబోతున్నారు. దిల్ రాజు సమర్పణలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాని ఆయన సోదరుడు శిరీష్ నిర్మించాడు.

Thandel: తండేల్ రాజ్ కోసం పుష్ప రాజ్.. రేపే జాతర

నిజానికి దిల్ రాజు నిర్మాతగా వచ్చిన గేమ్ చేంజర్ సినిమా హక్కులతో పాటే ఈ సంక్రాంతికి వస్తున్నాం హక్కుల్ని కూడా అమ్మారు. అయితే గేమ్ చేంజెర్ సినిమా నిరాశపరిచిన సరే సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి లాభాలు కురిపించింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించి దాదాపు 300 కోట్ల మార్కు దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో బయ్యర్లు అందరూ రేపు హైదరాబాద్ వస్తున్నారు వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి టీం మొత్తానికి థాంక్స్ చెప్పబోతున్నారు. అంతేకాదు రేపు రాత్రికి హైదరాబాద్లో ఒక పార్టీ కూడా జరగబోతోంది. ఇది ఇప్పటి ట్రెండ్ కి కాస్త భిన్నమే అని చెప్పాలి.

Exit mobile version