విక్టరీ వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కలెక్షన్స్ పరంగా అనేక రికార్డులు సృష్టిస్తోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైన ఈ సినిమా, తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ. 45 కోట్ల గ్రాస్ వసూలు చేసి, వెంకటేష్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్ సాధించగా తరువాత కూడా ఈ సినిమా ఏమాత్రం తగ్గడం లేదు. రెండు రోజుల్లో ఈ సినిమా రూ. 77 కోట్ల గ్రాస్‌ను దాటింది. ఇక మూడవ రోజుకు వచ్చేసరికి, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 106 కోట్ల గ్రాస్‌ను రాబట్టి, 100 కోట్ల క్లబ్‌లో చేరింది. నాలుగో రోజు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా రూ. 131 కోట్ల గ్రాస్‌ను రాబట్టి మరింత ముందుకు దూసుకుపోతోంది.
Saif Ali Khan: పదే పదే బట్టలు మారుస్తున్న నిందితుడు.. క్రైమ్ వెబ్ సిరీస్ ప్రభావమేనా?
ఈ విజయంతో, వెంకటేష్ తన కెరీర్‌లో ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినట్టు అయింది. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి విన్నర్ గా దూసుకుపోతుంది. విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. కామెడీ, కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు కలగలిపిన ఈ కథ ప్రేక్షకులను మెప్పించింది. చిత్రంలో వెంకటేష్ తన విభిన్న నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.