NTV Telugu Site icon

Sankranthiki Vasthunam: ఆరు రోజుల్లో 100 కోట్ల షేర్

Sankranthiki Vasthunam

Sankranthiki Vasthunam

సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన రిలీజ్ అయిన వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు సమర్పించగా ఈ సినిమాని ఆయన సోదరుడు శిరీష్ నిర్మించారు. మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటున్న ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబడుతుంది. ఇప్పటికే ఐదు రోజులకు గాను 160 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టగా ఇప్పుడు తాజాగా సినిమా యూనిట్ మరో ఆసక్తికరమైన ప్రకటన చేసింది. అదేందంటే ఆరు రోజులలో ఈ సినిమా 100 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిందని ప్రకటించారు. ఐశ్వర్య రాజేష్ తో పాటు మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఒక మాజీ పోలీస్ అధికారి ఒక విఐపిని కిడ్నాప్ నుంచి ఎలా తప్పించాడు అనే లైన్ మీద తెరకెక్కించారు.

Anupama Parameswaran : యంగ్ హీరోలను రౌండప్ చేస్తోన్న మలయాళ బ్యూటీ

వెంకటేష్ కొడుకు పాత్రలో నటించిన రేవంత్ అనే బుడ్డోడి పాత్ర బాగా వర్కౌట్ అవడంతోపాటు కామెడీ కూడా బాగా వర్క్ ఔట్ కావడంతో ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి సినిమా కనెక్ట్ కావడంతో ఈ సినిమా ఎక్కడా తగ్గేది లేదనట్లు దూసుకుపోతోంది. అనకాపల్లి నుంచి అమెరికా వరకు టికెట్లు కూడా దొరకని పరిస్థితి నెలకొందంటే సినిమా మీద క్రేజ్ ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దిల్ రాజుకు ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తూ ఉండడంతో సీక్వెల్ కూడా అనౌన్స్ చేసేసారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈసారి సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం అనే టైటిల్తో సినిమా చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది.