Site icon NTV Telugu

Sanjjanaa : ఆ కన్నడ హీరో పట్టుకుని పిసికేశాడు.. బుజ్జిగాడు హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

Sanjjanaa Galrani

Sanjjanaa Galrani

‘బుజ్జిగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి సంజన గల్రానీ, కన్నడలో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నా సంజనకు తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు రాలేదు. ఇక కన్నడలో బిజీ అవుతున్న టైంలో సంజన డ్రగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలు జీవితాన్ని అనుభవించి తరువాత బెయిల్‌ మీద బయటకు వచ్చింది. ఆ తరువాత ఆ డ్రగ్స్ కేసును కోర్టు కొట్టేసింది కూడా. నిజానికి ఈ డ్రగ్స్ కేసు పంచాయతీ నడుస్తున్నప్పుడే ఓ ముస్లిం డాక్టర్ ను పెళ్లి చేసుకోవడంతో ఆమె లవ్ జిహాదీ బాధితురాలనే చర్చ కూడా జరిగింది. అయితే ఆమె గతంలో ఓ తెలుగు ఇంటర్వ్యూలో కన్నడ స్టార్ హీరో గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతున్నాయి.

TG Govt: ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై కీలక సమీక్ష..

కన్నడలో ఒక హీరో ఉన్నాడు, అతనితో నాకు టార్చర్ అయిపోయింది. అతను ఫ్రస్ట్రేషన్ ఉన్న హీరో, అతని పేరు చెప్పను కానీ అతనితో నాకు ఒక సీన్ ఉంది. డాన్స్ చేస్తున్నట్టు నా భుజాలు పట్టుకుని కదపాల్సి ఉంది. అతనికి డైరెక్టర్ కి గొడవ నడుస్తోంది. యాక్షన్ చెప్పాక వచ్చి నా చేతి భుజాల వద్ద పట్టుకుని పిసికేశాడు, డ్యూడ్ ఇంత గట్టిగానా నాకు నొప్పిగా ఉంది అంటే ఓహ్, సారీ మేనేజ్ చేసుకో అన్నాడు. నేను ఇలా దెబ్బలు తినడానికి హీరోయిన్ గా రాలేదు. నిజానికి కొన్ని సార్లు ఇలాంటి క్రాక్ కాండేట్లు దొరుకుతారు అని సంజన చెప్పింది. వెంటనే నేను మీతో ఒక అరగంట షూట్ చేయను, ఇదేమీ యాక్షన్ సీక్వెన్స్ కాదు. నేనేమీ మీకు ఎదురుగా దొరికే రౌడీ కాదని చెప్పి వెళ్లిపోయానని సంజన కామెంట్ చేసింది. అయితే ఆ హీరో ఎవరు? అనే విషయం మాత్రం ఆమె బయట పెట్టలేదు.

Exit mobile version