బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ఇప్పటికే పలు తెలుగు సినిమాల్లో నటించాడు. మరికొన్ని తెలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పుడు తాజాగా ఆయన మరో తెలుగు సినిమాలో ఎంపికైనట్లుగా తెలుస్తోంది. సాయి ధరంతేజ్ హీరోగా సంబరాలు ఏటిగట్టు అనే సినిమా తెరకెక్కుతోంది. హనుమాన్ నిర్మాతల నిర్మాణంలో రోహిత్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ వెలుగులోకి వచ్చింది.
Kedar : నిర్మాత కేదార్ కుటుంబానికి అడ్వాన్స్ తిరిగిచ్చేసిన సుక్కు, విజయ్?
అదేంటంటే ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో అంటే విలన్ గా సంజయ్ దత్ కనిపించబోతున్నాడని చెబుతున్నారు. రోహిత్ వెళ్లి ఆయనకు కథ చెబితే అది బాగా నచ్చిందని, దానికి తోడు రెమ్యూనరేషన్ కూడా భారీగా ఇచ్చేందుకు హనుమాన్ నిర్మాతల సిద్ధమవడంతో ఆయన సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఆయన షూట్లో పాల్గొంటాడని రామ- లక్ష్మణ్ మాస్టర్ కంపోజ్ చేస్తున్న ఫైట్ లో ఆయన పాల్గొనబోతున్నాడని తెలుస్తోంది.