‘కె.జి.ఎఫ్ -2’ డబ్బింగ్ పూర్తి చేసిన సంజయ్ దత్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా మూవీ ‘కె.జి.ఎఫ్. చాప్టర్ 1’ దేశవ్యాప్తంగా సృష్టించిన సంచలనం ఇంతా అంతా కాదు. కన్నడలో తెరకెక్కిన ఈ మూవీని చాలామంది ‘బాహుబలి’తో పోల్చారు. ఆ మూవీ సరసన నిలబడదగ్గ చిత్రంగా కొనియాడారు. కన్నడంతో పాటు అప్పట్లోనే తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ‘కె.జి.ఎఫ్.’ విడుదలై ఘన విజయం సాధించింది. ‘బాహుబలి’ తరహాలోనే దీనిని కూడా దర్శకుడు ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ‘చాప్టర్ -2’ షూటింగ్ కొద్ది భాగమే బాలెన్స్ పెట్టుకున్నారు. కానీ కరోనా కారణంగా ఆ మాత్రం షూటింగ్ కూడా అనుకున్న సమయానికి పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇంతలో చాప్టర్ -2లో అధీరా పాత్ర పోషించిన సంజయ్ దత్ సైతం అనారోగ్యం పాలు కావడంతో మరికొంత ఆలస్యమైంది.
ఎట్టకేలకు ‘కె.జి.ఎఫ్. చాప్టర్ 2’ షూటింగ్ ను ఆ మధ్య పూర్తిచేసిన ప్రశాంత్ నీల్, డబ్బింగ్ కార్యక్రమాలూ మొదలు పెట్టేశాడు. అందులో భాగంగానే బాలీవుడ్ క్రేజీ యాక్టర్ సంజయ్ దత్ తోనూ డబ్బింగ్ చెప్పించాడు. ఈ విషయాన్ని ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలియచేశాడు. సంజయ్ దత్ డబ్బింగ్ సెషన్ పూర్తి అయినట్టు అందులో ప్రకటించాడు. యశ్, శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, రామచంద్రరాజు, అనంత్ నాగ్, మాళవిక అవినాశ్, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రలు పోషించిన ‘కె.జి.ఎఫ్. చాప్టర్ 2’ వరల్డ్ వైడ్ వచ్చే యేడాది ఏప్రిల్ 14న విడుదల కానుంది.
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
Adheera is back in action! The dubbing sessions are done for #KGFChapter2 and is on its way to theaters near you on 14th April 2022! pic.twitter.com/xBYvvc2XYK
— Sanjay Dutt (@duttsanjay) December 7, 2021
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!