Site icon NTV Telugu

Sandhya Mridul: ఫాలోవర్స్ లేని నటీనటులకి ఇండస్ట్రీలో పనిలేదు..

Sandhya Mridul

Sandhya Mridul

ఈ రోజుల్లో వినోద పరిశ్రమలో ప్రతిభ, కృషి, అనుభవం కంటే ఎక్కువ ప్రాముఖ్యత పొందుతున్నది సోషల్ మీడియా ఫాలోయింగ్. ఇప్పుడు నటన కంటే “ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారు?” అనే ప్రశ్నే ఎక్కువ ప్రాధాన్యం పొందుతోంది. నటీమణులు తమ ప్రతిభను చూపించే వేదికగా కాకుండా, సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత జీవితాన్ని, స్టైల్‌ని ప్రదర్శిస్తూ గుర్తింపు పొందుతున్నారు. ఈ కొత్త పరిస్థితిపై ప్రముఖ నటి సంధ్య మృదుల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Also Read : Samantha : నా గతాన్ని తలుచుకుంటే నాకే నవ్వొస్తుంది..

తాజా ఇంటర్వ్యూలో సంధ్య మాట్లాడుతూ.. “ఇప్పటి పరిస్థితుల్లో నటన కంటే ఫాలోవర్లే ముఖ్యం అయ్యాయి. నేను సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా లేను, అందుకే నాకు ఛాన్స్‌లు రావడం లేదు. కానీ నాకు ఫాలోవర్స్ పెరగాలంటే ముందుగా పనివ్వాలి కదా? పని లేకుండా నేను ఎలా ఫేమస్ అవుతాను? ఫేమస్ కాకపోతే ఫాలోవర్స్ ఎలా పెరుగుతారు? ఇది సరైన వ్యవస్థనా? సోషల్ మీడియా ఆధారంగా అవకాశాలు ఇవ్వడం ఏంటో అర్థం కావడం లేదు. ఇప్పుడు కళ్లతో భావాలు చెప్పే నటనకు అవసరం లేదు, సోషల్ మీడియాలో కాస్త గ్లామర్ షో చేస్తే చాలు – అవకాశాలు వస్తున్నాయి. ఇది కళాకారుల పట్ల అన్యాయం” అని సంధ్య చెప్పింది.

సంధ్యా మృదుల్ వ్యాఖ్యలు వైరల్ కావడంతో నెటిజన్లు కూడా ఆమెకు మద్దతుగా నిలిచారు. ఒక అభిమాని ఇలా స్పందించాడు “ఇది నిజమే. ఇప్పుడు ప్రతిభ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. సోషల్ మీడియా ఇమేజ్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు.” మరొకరు వ్యాఖ్యానిస్తూ “ప్రేక్షకులే ఇప్పుడు కళాకారులను ఫాలోవర్ల సంఖ్యతో కొలుస్తున్నారు. ఇది కళకు అవమానం.” అని పేర్కొన్నారు. ఇంకొకరు “ఇది నిజం కానీ, ప్రస్తుతం ఇది తప్పించలేని వాస్తవం” అని కామెంట్స్ చేస్తున్నారు. అంటే తన సినీ అనుభవం, ప్రతిభ ఉన్నప్పటికీ సోషల్ మీడియా ఫాలోవర్ల కొరత కారణంగా అవకాశాలు దొరకకపోవడం సంధ్యకు బాధ కలిగిస్తోంది. ఆమె మాటల్లో “ప్రతిభను పక్కనపెట్టి ఫాలోవర్స్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం ఇండస్ట్రీకి నష్టం. కళను ప్రేమించే వారికి ఇది నిరాశ కలిగించే పరిస్థితి” అని చెప్పింది.

Exit mobile version