‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి చిత్రాలతో ఇండియన్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రతిభావంతుడు, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తాజాగా తన మొదటి సినిమాపై ఓ ఆసక్తికర విషయం పంచుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా రూపొందనున్న ‘స్పిరిట్’ సినిమాపై ఫోకస్ చేస్తున్న సందీప్.. ఇటీవల విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘కింగ్‌డమ్’ ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంలో, ‘అర్జున్ రెడ్డి’ కు సంబంధించిన ఓ వ్యక్తిగత అనుభూతిని వెల్లడించాడు.
Also Read : Bigg Boss 9 : బిగ్ బాస్ 9 సామాన్యులకు కూడా ఎంట్రీ పై.. ఇంట్రస్టింగ్ అప్ డేట్
సందీప్ మాట్లాడుతూ.. ‘బడ్జెట్ లేక ఓ రిగ్రెట్ సీన్ వదిలేశాం.. అర్జున్ రెడ్డి సినిమాను నేను స్వయంగా నిర్మించడంతో, ఆ సమయంలో బడ్జెట్ పరిమితుల్ని ఎదుర్కొన్నాం. కొన్ని సన్నివేశాలు ప్లాన్ చేసిన చేయలేకపోయాం. ప్రత్యేకంగా చెప్పాలంటే – మంగళూరులోని ఒక ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో వర్షం కురుస్తున్నప్పుడు జరగే ఫుట్‌బాల్ మ్యాచ్‌ను చూపించాలనుకున్నాం. కానీ వర్ష సెట్‌అప్, గ్రాఫిక్స్, ప్రొడక్షన్ ఖర్చులు అన్నీ ఎక్కువవడంతో ఆ సీన్‌ను కట్ చేసి, కేవలం డ్రై వెర్షన్‌లోనే మ్యాచ్‌ను షూట్ చేశాం. ఇప్పటికీ ఆ సీన్ చేయలేకపోవడం ఒక చిన్న రిగ్రెట్‌గానే మిగిలింది’ అంటూ సందీప్ వివరించాడు.
