NTV Telugu Site icon

Sandeep Reddy Vanga: కబీర్ సింగ్, యానిమల్ సినిమాల్లో చైతూ బట్టలే రిఫరెన్స్

Sandeep Reddy Vanga

Sandeep Reddy Vanga

నాగచైతన్య హీరోగా నటించిన తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు సందీప్ రెడ్డి వంగా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నాకు కారణం ఏంటో తెలియదు కానీ కేడి అనే సినిమాకి పనిచేసినప్పుడు చైతూ గారు ఎక్కువగా షూటింగ్ కి వచ్చేవారు. ఆయన అంటే ఎందుకు అప్పటి నుంచే మంచి అభిప్రాయం ఏర్పడింది. ఇంతకుముందే నేను ఈ విషయం శివా నిర్మాణతో కూడా చెప్పాను. కొంతమందితో మనకి పరిచయం లేకపోయినా వారి మీద మంచి అభిప్రాయం ఆసక్తి ఉంటుంది. నాకు చైతన్య మీద కూడా అలాగే ఉంది. మీరు రియల్ లైఫ్ లో వేసుకునే బట్టలు మీరు లాంబోర్గిని కారు నడిపే విధానం ఇవన్నీ నాకు చాలా ఇష్టం. మీరు నమ్ముతారో లేదో తెలియదు గాని కబీర్ సింగ్ సినిమాలో కానీ అనిమల్ సినిమాలో కానీ నేను నా కాస్ట్యూమ్ డిజైనర్ కి మీరు రియల్ లైఫ్ లో వేసుకునే బట్టలే రిఫరెన్స్ గా చూపించేవాడిని.

Bunny Vasu: తండేల్ నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ సినిమా

ఇది ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదు ఇప్పుడే చెబుతున్నాను అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అంతేగాక సాయి పల్లవి గురించి మాట్లాడుతూ తాను అర్జున్ రెడ్డి సినిమా హీరోయిన్ కోసం వెతుకుతున్నప్పుడు కేరళ నుంచి ఒక కోఆర్డినేటర్ నాకు కాల్ చేశాడు. నేను మీ పేరు చెప్పి ఒక రొమాంటిక్ సినిమా చేస్తున్నాను ఆమె నటిస్తుందా అని అడిగితే అందులో రొమాన్స్ పాళ్లు ఎంతవరకు ఉండవచ్చు అని అడిగాడు. ఎక్కువ అదే ఉంటుందని అంటే మీరు ఆమె గురించి మర్చిపోండి ఆమె కనీసం స్లీవ్ లెస్ కూడా వేసుకోదు అని అన్నాడు. నేను సరే అన్నాను. అయితే హీరోయిన్లు ఏదో ఒక సమయంలో వారు తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకుంటారు కానీ మీరు మొదటి రోజు ఏ నిర్ణయం తీసుకున్నారు దానికి కట్టుబడి పద్ధతయిన పాత్రలు మాత్రమే చేస్తూ వస్తున్నారు. అది మామూలు విషయం కాదు అని ఆయన చెప్పుకొచ్చారు.