Site icon NTV Telugu

Sandeep Reddy : ఆమె నిజస్వరూపం ఇదే.. బాలీవుడ్ హీరోయిన్‌పై సందీప్ రెడ్డి ఫైర్

Sandeep Redy Vanga

Sandeep Redy Vanga

‘యానిమల్’ మూవీతో ఒక్కసారిగా టాలీవుడ్ టూ బాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఇక త్వర‌లో ఆయ‌న ప్రభాస్ తో ‘స్పిరిట్’ అనే చిత్రంతో ప్రేక్షకుల‌ని ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ఇందులో యానిమ‌ల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ క‌థానాయిక‌గా న‌టిస్తుంద‌ని ఇటీవ‌ల అనౌన్స్ చేశాడు. అయితే ముందు దీపికా అంటూ వార్తలు రాగా, అనేక కండిషన్లు పెట్టడం వల్ల ఆమెకు సందీప్ గుడ్ బై చెప్పేశాడని వార్తలొచ్చాయి. అయితే ఇదే ఇష్యూ మీద బాలీవుడ్ మీడియాలో వరుసగా సందీప్‌ను టార్గెట్ చేస్తూ పిచ్చి పిచ్చి వార్తలు పుట్టిస్తున్నారు.

Also Read : Kannappa : ‘కన్నప్ప’ కి కన్నం వేసిన ఆఫీస్ బాయ్..

అని గ్రహించిన సందీప్ రెడ్డి వంగా దీపికాకి గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చాడు.. సోమవారం అర్ధరాత్రి వేళ ‘ఎక్స్’ వేదిక‌గా దీపిక పేరు ఎత్తకుండానే కుండ బద్దలు కొట్టినట్లు గా మాట్లాడాడు. ‘నేను ఒక క‌థ‌ని ఆర్టిస్ట్‌కి చెప్పానంటే అవ‌త‌లి వ్యక్తిపై ఉన్న పూర్తి న‌మ్మకంతోనే చెబుతాను. కానీ ఆ కథను బయట పెట్టడం ద్వారా ఆ వ్యక్తి తన స్వభావాన్ని చాటి చెప్పారు. నా కథని బహిర్గతం చేయడమే కాకుండా ఒక యంగ్‌ యాక్టర్‌ని కూడా తక్కువ చేయ‌డం మీ ఫెమినిజం? ఒక సినిమా కోసం ఎన్నో ఏళ్లు క‌ష్టప‌డాల్సి వ‌స్తుంది. నాకు అన్ని ఫిల్మ్ మేకింగ్. అది ఆ వ్యక్తి అర్థం చేసుకోదు. ఎప్పటికీ అర్థం కూడా కాదు’ అని సందీప్ అన్నారు. అలానే తన దైన స్టయిల్‌లో హిందీలో డైలాగ్‌ని పంచుకున్నారు. అంతేకాదు ‘డర్టీపీఆర్ గేమ్స్’ అంటూ యాష్‌ ట్యాగ్‌ని కూడా మెన్షన్‌ చేశారు. దీంతో ఈ ట్వీట్ ఎవ్వరిని ఉద్దేశించి పెట్టాడో ఈ పాటికి అందరికీ అర్థమైపోవడంతో ఆమె మీద, బాలీవుడ్ పీఆర్ మాఫియా మీద నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

 

Exit mobile version