Site icon NTV Telugu

Sandeep Reddy : డైరెక్టర్ కంటే ఐఏఎస్‌ అవ్వడం ఎంతో ఈజీ

Untitled Design (60)

Untitled Design (60)

‘అర్జున్‌ రెడ్డి’ మూవీతో సెన్సెషనల్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ మార్క్‌ను ఏర్పర్చుకున్నారు సందీప్ రెడ్డి వంగా. ఇదే మూవీని హిందీలో కూడా తీసి అక్కడ కూడా మంచి హిట్ అందుకున్నాడు. ఇక 2023లో ఆయన తీసిన ‘యానిమల్’ సినిమాతో దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకన్నారు. అయితే ఈ మూవీ ఎంత హిట్ సాధించిందో అంతే వివాదాలు కూడా ఎదురుకుంది. ఈ సినిమా విషయంలో సందీప్‌ చాలా సందర్భాల్లో వివాదాల్లో చిక్కుకున్నారు. అయితే తాజాగా గతంలో ‘యానిమల్‌’ చిత్రాన్ని ఉద్దేశించి ఓ మాజీ ఐఏఎస్‌ అధికారి చేసిన వ్యాఖ్యలపై, దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా రీసెంట్‌గా ఓ సందర్భంలో స్పందించారు.

Also Read: OTT : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విడాముయార్చి.. ఎక్కడ చూడాలంటే .?

‘12Th ఫెయిల్‌’లో యూపీఎస్సీ ప్రొఫెసర్‌గా నటించిన మాజీ ఐఏఎస్‌ అధికారి వికాస్‌ దివ్య కీర్తి.. ఆ సినిమా విడుదలైన సమయంలో ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా సమాజానికి ఇలాంటి సందేశాత్మక చిత్రాలు అవసరమని అనంతరం ‘యానిమల్‌’ను ఉద్దేశించి ఈ తరహా చిత్రాలు సమాజానికి అనవసరమైనవి అన్నట్లుగా మాట్లాడారు. వీటి వల్ల డబ్బు మాత్రమే సంపాదించగలరు సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదు అని మాట్లాడారు.

అయితే ఈ కామెంట్స్ పై తాజాగా సందీప్ స్పందించాడు.. ‘ఆయన మాటలు నిజంగా నన్నెంతో బాధించాయి. నేను ఏదో నేరం చేశాననిపించింది. ఆయన అనవసరంగా నా సినిమా గురించి తీవ్ర విమర్శలు చేశారు. నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్న ఐఏఎస్‌ అధికారి కావాలంటే.. దిల్లీ వెళ్లి ఏదైనా ఒక కోర్స్‌లో చేరి కష్టపడి చదివితే చాలు. అదే ఫిల్మ్‌ మేకర్‌, లేదా రచయిత కావాలంటే ఎలాంటి కోర్సులు, టీచర్లు ఉండరు. నీకు నువ్వుగా అన్నీ నేర్చుకోవాలి. అభిరుచి తోనే ముందుకు సాగాలి. ఇదే విషయాన్ని కావాలంటే నేను పేపర్‌పై కూడా రాసి ఇస్తాను’ అని సందీప్‌ రెడ్డి వంగా తెలిపాడు.

Exit mobile version