టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సినిమా మజాకా. ధమాకా ఫేం దర్శకుడు త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్యమూవీస్ బ్యానర్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సందీప్ కిషన్ కెరీర్ లో 30వ సినిమాగా రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, సాంగ్స్ కు మంచి స్పందన లభించింది. తాజాగా మజాకా ట్రైలర్ ను రిలీజ్ చేసారు మేకర్స్.
Also Read : Deva : షాహిద్ కపూర్ ఖాతాలో మరో ప్లాప్ సినిమా
కాగా ఈ సినిమాతో పీపుల్స్ స్టార్ అనేట్యాగ్ ను తగిలించుకున్నాడు సందీప్ కిషన్. ఇప్పుడు ఈ ట్యాగ్ వ్యవహారం సోషల్ మీడియాలో వివాదానికి దారి తీసింది. విప్లవ భావాలపై సినిమాలు తీసి సూపర్ హిట్స్ అందుకున్న ఆర్ నారాయణ మూర్తిని ప్రేక్షకులు పీపుల్స్ స్టార్ అని పిలుచుకుంటారు. నారాయణ మూర్తి ఏ రోజు డబ్బులు కోసం కాకుండా తాను నమ్ముకున్న భావాల కోసం సినిమాలు తీసేవారు. ఇప్పుడు అయన ట్యాగ్ ను సుందీప్ కిషన్ పెట్టకోవం పై నెటిజన్స్ మండిపడుతున్నారు. తాజాగా జరిగిన మాజాకా ట్రైలర్ లాంచ్ లో మీడియా అడిగిన ప్రశ్నకుకు సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘ నారాయణ మూర్తి గారికి ఆ ట్యాగ్ ఉన్న విషయం నాకు తెలియదు. నేను ట్యాగ్‌ల మీద అసలు ఫోకస్ పెట్టను. ఎవరినీ భాదపెట్టాలనే ఉద్దేశం నాకు అసలు లేదు. ఈ ట్యాగ్ నాకు పెట్టిన తర్వాత మూర్తి గారికి ఆ ట్యాగ్ ఉన్న విషయం నాకు తెలిసింది. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏం చేయాలో మేము ఆలోచించాం’ అని వివరణ ఇచ్చాడు.