Site icon NTV Telugu

Sundeep kishan : రవితేజ దర్శకుడితో సందీప్ కిషన్ మూవీ.. షూటింగ్ మొదలు..

Sk30

Sk30

Sundeep kishan :టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.వరుసగా కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న సందీప్ ఈ ఏడాది “ఊరిపేరు భైరకోన”.దర్శకుడు విఐ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 16 న రిలీజ్ అయి మంచి విజయం సాధించింది.ఈ సినిమాలో సందీప్ సరసన వర్ష బొల్లమ్మ,కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటించారు.ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాండ్ రావడంతో భారీగా కలెక్షన్స్ సాధించింది.ప్రస్తుతం ఈ యంగ్ హీరో మరో క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు.

Read Also :Klin Kaara : క్లింకారా ఫస్ట్ బర్త్ డే.. ఉపాసన ఎమోషనల్ పోస్ట్ వైరల్..

మాస్ మహారాజ రవితేజకు ధమకా వంటి బ్లాక్ బస్టర్‌ సినిమాను అందించిన దర్శకుడు త్రినాధ రావు నక్కినతో సందీప్ తన తర్వాత సినిమా చేయబోతున్నాడు ఏస్‌కే30గా రాబోతున్నఈ సినిమా షూటింగ్ ను చిత్ర యూనిట్ తాజాగా ప్రారంభించింది.ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.తనదైన కామెడీ స్టైల్ లో దర్శకుడు త్రినాధరావు నక్కిన ఈ సినిమాను పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర సమర్పిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే ,డైలాగ్స్ అందిస్తున్నాడు. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Exit mobile version