NTV Telugu Site icon

Sandalwood cinema : వరుస కాంట్రవర్సీల్లో చిక్కుకుంటోన్నశాండిల్ వుడ్

Banarus

Banarus

కన్నడ ఇండస్ట్రీ పాన్ ఇండియన్ లెవల్లో ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది. కేజీఎఫ్, కాంతార తెచ్చిన క్రేజ్ శాండిల్ వుడ్‌పై ఫోకస్ పెంచాయి. కానీ రీసెంట్ టైమ్స్‌లో పలు కాంట్రవర్సీల్లో చిక్కుకుంటోంది కర్ణాటక సినీ పరిశ్రమ. యష్ చేస్తోన్న టాక్సిక్ షూటింగ్ కోసం  ప్రభుత్వ అనుమతి లేకుండా చెట్లు నరికేశారన్న ఆరోపణలపై నిర్మాతపై కేసు ఫైల్ కావడంతో పాటు సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. రిషబ్ శెట్టి  డైరెక్ట్ చేస్తున్న కాంతారా యూనిట్ సభ్యులతో వెళుతోన్న మినీ బస్సు బోల్తా పడి కొంత మందికి గాయాలయ్యాయి.  అయితే ఈ రెండూ ఇష్యూస్‌లో హీరో ఇన్వాల్‌మెంట్ లేదు.

Also Read : Pushpa : పుష్ప – 3 ఫిక్స్.. టైటిల్ ఇదే..?

కానీ తాజాగా ఓ వివాదం హీరో కెరీర్ పైనే ఎఫెక్ట్ చూపేలా ఉంది. కన్నడ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎదుగుతున్న జైద్ ఖాన్   ప్రజెంట్  కల్ట్ అనే మూవీని చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చిత్రదుర్గలో జరుగుతోంది. షూటింగ్ టైంలో డ్రోన్ విరిగిపోతే  టెక్నీషియన్ సంతోష్‌కు డబ్బులు చెల్లించకపోవడంతో ఆత్మహత్యకు యత్నించాడు. సంతోష్ బ్రదర్ కంప్లంట్‌తో కేసు నమోదు చేసిన పోలీసులు  విచారణకు ఆదేశించారు. అయితే ఇక్కడ సంతోష్ హీరోపై తీవ్రమైన ఎలిగేషన్స్ చేశాడు. డ్రోన్ విరిగిపోగా డబ్బులు చెల్లించాలని ఈ మూవీ నిర్మాత కం హీరో జైద్ ఖాన్ క్యారవాన్‌కు వెళ్లి మనీ అడిగితే అవమానించి కాగితంపై బలవంతంగా యూనిట్ తప్పులేదని సంతకం చేయించాడని ఆరోపిస్తున్నాడు.  ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతోన్న హీరోపై ఇలాంటి ఎలిగేషన్స్ రావడంతో శాండిల్ వుడ్ మొత్తం ఈ విషయంపై చర్చించుకుంటుంది.  మరీ ఈ కేసు వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.

Show comments