NTV Telugu Site icon

Samyuktha Menon: క్రేజియస్ట్ హీరోయిన్ సంయుక్త మీనన్.. చేతిలో అన్ని సినిమాలున్నాయా?

Samyuktha-Menon

మాలీవుడ్ భామలకు టాలీవుడ్ లో ఉండే క్రేజే వేరు.. ఆ జాబితాలో రీసెంట్లీ జాయిన్ అయ్యింది కేరళ కుట్టీ సంయుక్త మీనన్. భీమ్లా నాయక్ తో టాలీవుడ్ లో ఏ ముహుర్తాన అడుగుపెట్టిందో కానీ.. హ్యాట్రిక్ హీరోయిన్ గా మారి.. ప్లాపుల్లో ఉన్న హీరోలకు హిట్స్ ఇచ్చి గోల్డెన్ లెగ్ అయ్యింది. పనిలో పనిగా రెమ్యునరేషన్ పెంచేసింది. మరీ ఆ భామకు ఉన్న డిమాండ్ అట్లాంటిది. విరూపాక్షతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ మలయ మారుతుం.. అటు కోలీవుడ్ లో కూడా మంచి స్కోరే కొట్టేసింది. వాతితో మరో హిట్టును తన ఖాతాలో వేసుకుంది. మధ్యలో కొన్ని పిక్చర్స్ బెడిసికొట్టినా.. ఆమె కెరీర్ పై ఎఫెక్ట్ చూపలేదు సరికదా.. ఆఫర్లు వెల్లువలా వచ్చాయి.

Priyanka Chopra: చిలుకూరి బాలాజీ గుడిలో ప్రియాంక చోప్రా

బాలీవుడ్ కూడా సంయుక్త క్రేజ్ కు ఫిదా అయిపోయి.. ఛాన్స్ ఇచ్చింది. ప్రెజెంట్ మలయాళ భామ చేతిలో ఆరు క్రేజీయెస్ట్ ప్రాజెక్టులున్నాయి. మహారాగ్నితో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న అమ్మడు.. తెలుగులో యంగ్ హీరోలను లైన్లో పెట్టేసింది. నిఖిల్ స్వయంభుతో పాటు శర్వానంద్ నారీ నారీ నడుమ మురారీ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో పాటు మరో సినిమా చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఓన్ ఇలాకాలో మోస్ట్ యాంటిసిపెటెడ్ మూవీ రామ్ లో కనిపించబోతుంది. జీతూ జోసెఫ్- మోహన్ లాల్ కాంబోలో రాబోతున్న ఫిఫ్త్ ప్రాజెక్ట్ ఇది. స్టార్ హీరోయిన్లకు కూడా సాధ్యం కానీ ఈ లైనప్స్ చూస్తుంటే.. సంయుక్త కూడా టాప్ చెయిర్ లో కూర్చునేటట్లే కనిపిస్తోంది.