అమీర్ ఖాన్ సూపర్ హిట్ సినిమా ‘పికె’ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరికీ గుర్తుండే ఉంటుంది. పోస్టర్లో ఆమీర్ నగ్నంగా టేప్ రికార్డర్ అడ్డం పెట్టుకుని ఉన్న ఆ ఒక్క పోస్టర్ సినిమాపై ఎంతో హైప్ ని పెంచింది. ఇప్పుడు సంపూర్ణేష్ బాబు తాజా చిత్రం ‘క్యాలీఫ్లవర్’ కాన్సెప్ట్ పోస్టర్ PK ఫస్ట్ లుక్ ని గుర్తు చేస్తోంది. అసెంబ్లీ ముందు సంపూర్నేష్ కాలీఫ్లవర్ అడ్డుపెట్టుకుని నగ్నంగా నిలుచున్నపోస్టర్ ఇది. టాలీవుడ్‌లో ఎప్పుడూ తన సినిమాల ద్వారా ప్రయోగాలు చేయడంలో ముందుంటాడు సంపూ. అసెంబ్లీ ముందు ధర్నా చేస్తున్నట్లు ఉన్న ఈ ‘క్యాలీఫ్లవర్’ పోస్టర్ లో టైటిల్ కి ట్యాగ్ గా పెట్టిన ‘శీలో రక్షతి రక్షిత:’ అందరినీ మరింతగా ఆకట్టుకుంటోంది. ఆర్.కె.మలినేని దర్శకత్వంలో ఆశాజ్యోతి గోగినేని నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంపూ సరసన వసంత హీరోయిన్ గా నటిస్తోంది.
ఆకట్టుకుంటున్న సంపూ నగ్నచిత్రం
