NTV Telugu Site icon

Samantha : ఇన్‌స్టాగ్రామ్‌ లో సమంత పోస్టుపై వణికిపోతున్నటాలీవుడ్.. కారణం ఇదే..?

Untitled Design (1)

Untitled Design (1)

మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటి నివేదిక ప్రకంపనలు సృష్టిస్తోంది. 2017లో ఓ మహిళా ఆర్టిస్ట్ పై జరిగిన లైంగిక ఆరోపణల నేపథ్యంలో WCC ( విమేన్ ఇన్ సినిమా కలెక్టివ్) ఏర్పాటైంది.  మలయాళ ఇండస్ట్రీలో మహిళా నటీమణులు లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్, ఎడ్జస్ట్ మెంట్ ఆరోపణల నేపథ్యంలో WCC  ఈ వ్యహారంపై కంప్లైంట్ చేయగా 2019లో హేమ కమిటీని నియమించింది అప్పటి కేరళ ప్రభుత్వం. హేమ కమిటీ నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో బాధిత నటీమణులు రేవతి సంపత్, మిను మునీర్ వంటి యాక్ట్రెస్ తమను సెక్సువల్ అబ్యూస్‌కు గురి చేశారంటూ కొంత మంది నటుల పేర్లు వెల్లడించారు. దీంతో మాలీవుడ్ లో సంచలనం రేకెత్తింది.

Also Read: Nani : మహేశ్ బాబు రికార్డుకు ఎసరు పెట్టిన నేచురల్ స్టార్ నాని..

ఇదిలా ఉండగా జస్టిస్ హేమ కమిటీ నివేదికపై టాలీవుడ్ నటి సమంత స్పందించింది. జస్టిస్ హేమ కమిటీ నివేదికను ఆమె స్వాగతీస్తూ టాలీవుడ్‌లోనూ కేరళ తరహా కమిటీ వేయాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్నీ కోరింది. కేరళలోని హేమ కమిటీ ఏర్పాటుకు కారణమైన WCC సంస్థను సమంత అభినందించింది. ఇదే బాటలో టాలీవుడ్ సపోర్ట్ గ్రూప్ ‘ది వాయిస్ ఆఫ్ ఉమెన్’ నడవాలని, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ (TFI) లోనూ ఇలాంటి కమిటీ వేయాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీనివల్ల భద్రమైన వాతావరణంలో మహిళలు పనిచేసేందుకు అవకాశం దొరుకుతుందని ఇన్‌స్టాగ్రామ్‌ సమంత కీలక పోస్టు చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.  మరోవైపు హేమ కమిటీ ఆరోపణలపై నైతిక బాధ్యత వహిస్తూ అమ్మ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్.