Samantha to Appear before Media afteer Konda Surekha Comments: నటి సమంత మీద, అక్కినేని కుటుంబం మీద తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంత పెద్ద కలకలం రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయం మీద సినీ పరిశ్రమ అంతా ఒక్కటై కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించింది. అయితే ఇప్పుడు ఈ వివాదం అనంతరం సమంత మొట్టమొదటిసారిగా మీడియాని ఫేస్ చేయబోతున్నారు. అయితే అది ఆమె సినిమా కోసం కాదు. అసలు విషయం ఏమిటంటే అలియాభట్ హీరోయిన్గా నటించిన జిగ్రా అనే సినిమా ఈ దసరాకి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాని ప్రమోట్ చేసేందుకు అలియాభట్ హైదరాబాద్ వస్తున్నారు.
రేపు సాయంత్రం నాలుగు గంటల నుంచి పార్క్ హయత్ లో ఈ జిగ్రా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా త్రివిక్రమ్, సమంత, రానా వంటి వారిని ఆహ్వానించారు. అయితే ఈ సినిమా సొంత సినిమా కాకపోయినా సమంత ప్రెస్ మీట్ కి హాజరైతే కచ్చితంగా ఈ కొండా సురేఖ అంశానికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం కచ్చితంగా కనిపిస్తోంది. మరి సమంత ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సి ఉంది. ఇక ఇదే అంశం మీద ఇప్పటికే కొండా సురేఖ క్షమాపణలు తెలియజేశారు. తన మాటల వల్ల ఎవరైనా నచ్చుకుంటే క్షమించాలంటూ ఆమె కామెంట్ చేశారు. అయితే ఇప్పటికే ఆమె మీద నాగార్జున పరువు రాష్ట్రం దావా వేశారు. రేపు ఈ వ్యవహారంలోనే ఆయన కోర్టు కేసుకు కూడా హాజరు కాబోతున్నారు.