Site icon NTV Telugu

Samantha: సమంత నిరక్షరాస్యురాలు.. డాక్టర్ సంచలన వ్యాఖ్యలు

Samantha Post

Samantha Post

Samantha Ruth Prabhu slammed by Doctors for this Reason: నటి సమంత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక అంశం మీద చర్చ జరుగుతోంది. ఈ విషయం మీద మిరియాల శ్రీకాంత్ అనే డాక్టర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నటి సమంత వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినపుడు నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజ్ (పీల్చడం) చెయ్యండని చెప్తూ తన ఇన్స్టాలో పెట్టినట్లు లివర్ డాక్టర్ పెట్టారు. ఇదే నిజమైతే ఇంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదు అని ఆయన అన్నారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక అన్స్టేబుల్ కెమికల్, ఇది నీరు మరియు ఆక్సిజన్ గా మారుతుంది.

Saarangadariya Trailer: మందు, సిగరెట్, పేకాట, బెట్టింగ్‌ల కంటే పెద్ద వ్యసనం ఫెయిల్యూర్!

అయితే ఈ ఆక్సిజన్ అణువులుగా మారే ముందు పరమాణువులుగా ఉన్నప్పుడు ఫ్రీ రాడికల్స్లా పని చేసి అవి అప్పటికే వైరస్ వలన దెబ్బతిన్న ఊపిరితిత్తుల లోపలి పలుచని పొరల్ని బాగా దెబ్బ తీసి, న్యుమోనియా గానీ, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ కి కానీ దారి తీస్తుంది అని అన్నారు. ఇదొస్తే డైరెక్టు సావే. ఇక మీ ఇష్టం అని ఆయన హెచ్చరించారు. అయితే నిజానికి సమంత సోషల్ మీడియా ఇన్స్టా చెక్ చేస్తే ఆమె షేర్ చేసిన స్టోరీస్ లో ఆమె ఇదే విషయాన్ని నిజంగానే ప్రస్తావించింది. అంతేకాదు దానికి సంబందించిన ఒక వీడియో లింకును కూడా ఆమె షేర్ చేసింది. “ది లివర్ డాక్” అనే పేరుతో ఉన్న డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్ ఈ విషయం మీద ముందుగా స్పందిస్తూ ఈ నెబ్యులైజేషన్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని చెప్పడమే కాక సమంత ఒక హెల్త్ అండ్ సైన్స్ నిరక్షరాస్యురాలు” అని పేర్కొన్నారు.

Exit mobile version