Site icon NTV Telugu

Samantha: ఆ స్పెషల్ విషయం చెప్పేసిన సమంత.. ఏంటంటే?

Samantha News

Samantha News

Samantha Ruth Prabhu Attends Launch of World Pickleball League: సమంత ఇప్పుడు సినిమాలు కంటే ఎక్కువగా సోషల్ మీడియా ద్వారానే అభిమానులకు టచ్ లో ఉంటోంది. ఈ మధ్యనే నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ జరగగా అది జరిగిన కొద్ది రోజులకే సమంత కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ప్రధానంగా బాలీవుడ్ మీడియాలో సమంత రాజ్ డీకే దర్శక ద్వయంలోని రాజ్ తో ప్రేమలో ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆ సంగతి అలా ఉంచితే ఈ ఉదయం సమంత తన సోషల్ మీడియా వేదికగా ఈరోజు ఒక స్పెషల్ విషయాన్ని చెబుతున్నానని ప్రకటించింది. దీంతో ఆమె తన కొత్త జీవితానికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఇస్తుందేమోనని అందరూ అనుకున్నారు.

Balakrishna: అక్కా చెల్లెళ్లతో బాలయ్య రాఖీ సంబరాలు

కానీ ఆమె మాత్రం వరల్డ్ పికిల్ బాల్ లీగ్ ప్రెస్ మీట్ లో మెరిసింది. ఆమె చెప్పాలనుకున్న స్పెషల్ విషయం ఇదేనని తెలుస్తోంది. ఇక ఈ ఈవెంట్ ముంబైలో గ్రాండ్ గా జరిగింది. వరల్డ్ పికిల్ బాల్ లీగ్ కి సంబంధించిన అనేక విషయాలను ఈవెంట్ లో వెల్లడించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.. ఇక సినిమాల విషయానికి వస్తే సమంత ఇప్పుడిప్పుడే మళ్ళీ బిజీ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఆమె చేసిన సిటాడెల్ హనీ బన్నీ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. రాజ్- డీకే డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ సమంతను మళ్లీ బిజీ చేస్తుందని ఆమె బలంగా నమ్ముతోంది.

Exit mobile version