Site icon NTV Telugu

Samantha : అతని కోసమే పికిల్ బాల్ టీమ్ కొన్నాను!

Samantha

Samantha

ఆ మధ్య సమంత పికిల్ బాల్ అనే ఆటకు సంబంధించి ఒక టీం కొనుగోలు చేసి వార్తల్లోకి ఎక్కింది. నిజానికి మనకు అంతకుముందు పికిల్ బాల్ అనే ఆట గురించి అవగాహన లేదు, కానీ ఏకంగా సమంత ఒక పికిల్ బాల్ టీం కొనుగోలు చేసిన వార్త హాట్ టాపిక్ అయింది. అయితే ఈ కొనుగోలు ఎందుకు అనే విషయంపై తాజాగా స్పందించింది ఆమె. ఆమె నిర్మించిన “శుభం” అనే సినిమా మే తొమ్మిదో తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఆమె మీడియాతో ముచ్చటించింది.

Read More:Samantha: ఇక పర్సనల్ విషయాల గురించి మాట్లాడను

ఈ సందర్భంగా ఒక మీడియా ప్రతినిధి నుంచి ఎదురైన ప్రశ్నకు సమాధానంగా, గత ఐదేళ్లుగా తనకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్న హిమాంక్ ఇప్పుడు తన బిజినెస్‌లు అన్నింటికీ పార్టనర్‌గా వ్యవహరిస్తున్నాడని ఆమె చెప్పుకొచ్చింది. “నేను హెల్త్ ఫెనాటిక్ అయితే, అతను స్పోర్ట్స్ ఫెనాటిక్. ఈ రెండింటికి సంబంధించి ఏదైనా సోషల్ రెస్పాన్సిబిలిటీగా చేయాలని భావించి ఈ పికిల్ బాల్ టీం కొనుగోలు చేయడం జరిగింది. అతనికి ఈ ఆట మీద అవగాహన ఉంది, నాకు అతను చేసేది మంచిదనిపించింది.

Read More:Yamadonga : యమదొంగ రీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

కాబట్టి ఇద్దరి పార్ట్‌నర్‌షిప్‌లో ఈ టీం కొనుగోలు చేయడం జరిగింది,” అంటూ సమంత చెప్పుకొచ్చింది. “నిజానికి మేము గట్టిగానే పెట్టుబడి పెట్టాం. మహా అయితే రెండు మూడు ఏళ్లలో తిరిగి వస్తుంది, లేకపోతే ఇది బ్యాడ్ ఇన్వెస్ట్‌మెంట్ అనుకున్నాం. అనుకుంటే పెట్టిన ఏడాదిలోపే దాదాపు మాకు రికవరీ అయిపోయే పరిస్థితి ఏర్పడింది,” అని ఆమె చెప్పుకొచ్చింది. ఈ ఆట బాగా ఫాస్ట్‌గా ప్రజల్లోకి వెళుతోందని ఆమె అభిప్రాయపడింది.

Exit mobile version