Samantha vs Naga Chaitanya : సామ్ vs చై.. ఇప్పుడెందుకీ రచ్చ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంతకాలం సైలెంట్ గా ఉన్న సమంత, ‘మా ఇంటి బంగారం’ రిజల్ట్ తర్వాత విశ్వరూపం చూపిస్తుంది. ఇంతకాలం తనలో ఉన్న అపరిచితురాలను బయటకు తీసుకొచ్చిందా అనిపిస్తోంది. పని కట్టుకొని మరి నాగార్జునను కెలుకుతోందా అనిపిస్తుంది. ‘మా ఇంటి బంగారం’ హోర్డింగులు నాగార్జున ఇంటి వరకు పెట్టడంలో సమంత ఉద్దేశం ఏంటి? “ఇదిగో నిన్ను కాదని సినిమా తీసి చూపించా, హిట్టు కొట్టి చూపించా” అని నాగార్జునను, నాగచైతన్యను సమంత రెచ్చకొడుతుందా? లేదంటే ఇదంతా ఎందుకు చేస్తోంది?
సోషల్ మీడియాలో కొందరు కంటెంట్ రైటర్లు నాగచైతన్య రికార్డులను పోల్చి, సమంత ముందు నాగచైతన్య వేస్ట్ అన్నట్లుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇలాంటి కథనాలు రాసి వదలడం వెనుక సమంత టీం బలంగా పని చేస్తుందని టాక్. ఒక టీంని పెట్టుకొని ఆ టీం ద్వారా సోషల్ మీడియాలో నాగార్జునని, నాగచైతన్యని, చైతు భార్య శోభితని సమంత డ్యామేజ్ చేస్తుందని టాక్ బాగా నడుస్తుంది. ఈ వ్యవహారం వెనుక సమంత కొత్త భర్త రాజ్ నిడిమోరు సహకారం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. ‘మా ఇంటి బంగారం’ ఈవెంట్ లో శోభితను ఉద్దేశించి ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేసింది. మరో రకంగా శోభితను అడ్డం పెట్టుకొని చైతూని వెక్కిరించింది. ‘మా ఇంటి బంగారం’ థాంక్స్ మీట్ లో “రిలేషన్షిప్ లో ఉన్న అమ్మాయిలకు మీరు ఇచ్చే సలహా ఏంటి?” అని అడిగితే, “మీరు పర్ఫెక్ట్ గా లేకుండా ఎవరో వచ్చి మీ జీవితాన్ని ఫుల్‌ఫిల్ చేస్తారు అనుకుంటే కచ్చితంగా తప్పులు జరుగుతాయి” అని సెటైరికల్ గా కామెంట్ చేసింది సమంత. శోభిత దూళిపాళ్లకు తగలడానికే ఇలా సమంత మాట్లాడిందంటూ నాగచైతన్య ఫ్యాన్స్ మండి పడుతున్నారు.
Also Read
- RC18: గురువు తర్వాత శిష్యుడే.. రామ్ చరణ్ మాటతో భారీ అడ్వాన్స్ ఇచ్చిన టాప్ ప్రొడ్యూసర్!
- Nagabandham : ‘నాగబంధం’ ధైర్యం వెనుక అసలు నిజమిదే!
- Toxic : 'టాక్సిక్’ లేడీస్ & లేడీస్ గ్లిమ్స్ రిలీజ్.. ఈసారి మరింత వైల్డ్‌గా యశ్
- KTR-Prabhas: రచ్చ రచ్చే.. లైవ్‌లో రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఫోన్ చేసిన కేటీఆర్ (వీడియో)
నాగచైతన్యతో పెళ్లి సమయంలో శోభిత మాట్లాడిన మాటలను తిరిగి ఆమెకే తిప్పి కొట్టింది సమంత. “నాగచైతన్య లేకపోతే నా లైఫ్ ఫుల్‌ఫిల్ కాదు” అని అప్పట్లో శోభిత అన్న మాటలను ఇండైరెక్ట్ గా సమంత కోట్ చేస్తూ, “ఎవరో వచ్చి ఫిల్ చేస్తారు అనుకుంటే కచ్చితంగా తప్పులు జరుగుతాయి” అని కౌంటర్ ఇచ్చింది. ఈ డ్రామా అంతా థాంక్స్ మీట్ లో సమంత పిఆర్ టీం ఆడించిందే అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. విడాకుల తర్వాత చైతన్య టాపిక్ ఎప్పుడొచ్చినా ఇండైరెక్ట్ గా ఏదో ఒక సెటైర్ వేస్తుంది సమంత. ఆ సెటైర్స్ లో నాగచైతన్య పట్ల విపరీతమైన కసిని, కోపాన్ని ప్రదర్శిస్తుంది. ‘సిటాడెల్’ ప్రమోషన్ లో వరుణ్ ధావన్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ, “నా మాజీ మొగుడికి అనవసరంగా ఖరీదైన గిఫ్ట్‌లు ఇచ్చాను, అవసరం లేకపోయినా ఎక్కువ ఖర్చు పెట్టాను” అని వెటకారంగా సమాధానం ఇచ్చింది సమంత.
విడాకుల తర్వాత చైతన్య ఎప్పుడూ సమంతను గుర్తు చేసుకుంది లేదు, నెగిటివ్ గా కామెంట్ చేసింది లేదు. సమంతతో గడిపిన కాలం గాని, విడాకుల తర్వాత గాని ఎన్నడూ చైతన్య సమంతను ఒక్క మాట అనలేదు. “గౌరవంగా విడిపోయాం, ఇద్దరం సంతోషంగా ఉన్నాం” అని అంటాడే గానీ సమంతని ఎప్పుడూ టార్గెట్ చేయలేదు. సమంత మాత్రం ఎప్పటికప్పుడు తన కసి తీర్చుకుంటుంది. కరణ్ జోహార్ షోలో చైతన్యను ఉద్దేశించి వైల్డ్ కామెంట్స్ చేసింది. “నా మాజీ మొగుడు, నేను ఒక గదిలో ఉంటే పక్కన కత్తులు లేకపోతే మంచిది, లేకపోతే ఘోరాలు జరిగిపోతాయి” అని కామెంట్ చేసింది. అంటే చైతన్య ఎదురుగా ఉంటే పొడిచేస్తాను అన్నంతగా బిల్డప్ ఇచ్చింది.
సమంతలో ఎంత చపలచిత్త మనస్తత్వం ఉందో విడాకుల తర్వాత మరింత బయటపడింది. ప్రేమ, పెళ్లి, రిలేషన్, జీవితం… ఇలా ఏ టాపిక్ వచ్చినా ఏదో ఒక రకంగా చైతన్యను ముల్లుతో గుచ్చాలన్న తుత్తర సమంతలో బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏకంగా నాగార్జుననే టార్గెట్ చేసింది. సక్సెస్ ఫుల్ గా రెండో పెళ్లి చేసుకుని, ‘మా ఇంటి బంగారం’తో హిట్ కొట్టడం ద్వారా అక్కినేని ఫ్యామిలీ పై ప్రతీకారం తీర్చుకున్నట్టుగా ఫీల్ అవుతోంది సమంత. అక్కినేని నాగార్జునకు, అతని కుటుంబానికి సమంత కాంపిటీటర్ ఎలా అవుతుంది? తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగార్జున కుటుంబానిది 85 ఏళ్ల అనుబంధం. అక్కినేని కుటుంబంలో మూడు తరాలు తెలుగు ఇండస్ట్రీలో మనగలిగాయంటే ఆ కుటుంబానికి ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉన్నట్టేగా! నిజంగానే నాగార్జున తలచుకుంటే డివోర్స్ తర్వాత సమంత మళ్ళీ టాలీవుడ్ లో అడుగు పెట్టడం సాధ్యమేనా? ఆమెను వేధించాలని అనుకుంటే ఇండస్ట్రీలో అడ్డుకోవడం పెద్ద కష్టమా? చైతన్య గాని, నాగార్జున గాని విడాకుల తర్వాత ఎంతో హుందాగా ప్రవర్తించారు. కానీ సమంత నాగార్జునతో కొత్త వివాదాలు తెచ్చుకుంటుందనే చర్చ జరుగుతోంది.
తాజావార్తలు
-
Samantha vs Naga Chaitanya : సామ్ vs చై.. ఇప్పుడెందుకీ రచ్చ?
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్‌తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
APEAPCET: ఏపీఈఏపీసెట్ ఫలితాలు విడుదల
-
RC18: గురువు తర్వాత శిష్యుడే.. రామ్ చరణ్ మాటతో భారీ అడ్వాన్స్ ఇచ్చిన టాప్ ప్రొడ్యూసర్!
-
Kejriwal: సనాతనం అంటే అధికారం.. డబ్బేనా? అయోధ్య స్కామ్‌లో బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్‌ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..