NTV Telugu Site icon

Samantha : హాస్పిటల్ బెడ్ పై సమంత ?

Samantha (5)

Samantha (5)

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ అందుకుంది సమంత. ‘ఏ మాయ చేసావే’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ భారీ పాపులారిటీ అందుకుంది. ఆ తర్వాత మహేష్ బాబు,ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోల సరసన నటించి భారీ పాపులారిటీ అందుకుంది. కానీ ఈ సక్సెస్ తనకు ఎక్కువ కాలం లేదు. కెరీర్ పీక్స్‌లో ఉండగానే సమంత జీవితం తలక్రిందులుగా మారిపొయింది. భర్తతో విడాకులు అనంతరం అనారోగ్య సమస్యలు. ఇలా వరుసగా దెబ్బ మీద దెబ్బ పడటంతో కోలుకోడానికి సామ్‌కి చాలా సమయం పట్టింది. ఇక అంత సర్ధుమనిగింది అనుకుంటున్న టైంలో ఆమె..మరో ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: Amitabh Bachchan : కౌన్ బనేగా కరోడ్ పతి నుంచి తప్పుకోవడం పై స్పందించిన బిగ్ బీ

తాజాగా సమంత పెట్టిన పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. పలు చిత్రాల్లో నటిస్తూనే.. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సామ్‌ ‘ట్రలాలా’ పేరుతో ప్రొడక్షన్‌ హౌజ్‌ను ప్రారంభించింది. ఈ బ్యానర్‌పై తెరకెక్కించిన తొలి చిత్రం ‘శుభం’ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొన్ని ఫొటోలను షేర్‌ చేసింది సామ్. అందులో సామ్‌ హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ ఎక్కించుకుంటున్న ఫోటో కూడా ఉంది. ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు, అభిమానులు సమ్‌కు మళ్ళి ఏమైంది అంటూ ఆందోళన చెందుతున్నారు. ప్రజంట్ ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది.