NTV Telugu Site icon

Samantha: హే సామ్.. ఏంటి ఇలా తయారయ్యావ్?

Samantha

Samantha

అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సమంత. టాలీవుడ్, కోలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టి తనకంటూ మంచి స్టార్ డమ్ ఏర్పర్చుకుంది. సమంత ఊ అనాలేగానీ ఇప్పటికీ చేతినిండా సినిమాలే సినిమాలు. కానీ ఆమె మాత్రం ఒకప్పటిలా సినిమాలు చేయట్లేదు..? వరుసగా అవకాశాలు ఇచ్చే దర్శక నిర్మాతలు ఉన్నా కూడా. కావాలనే సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంది. ఆమె ఇటీవల ‘సిటాడెల్:హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్‌లో నటించి ఆకట్టుకుంది. ఇక తాజాగా, సమంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫొటోలు షేర్ చేసింది.

Lavanya : నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి మరోసారి లావణ్య

ఇందులో ఆమె షార్ట్ హెయిర్‌తో బాబ్ కట్ చేయించుకుని కనిపించింది. ఈ క్రమంలోనే జుట్టు మొత్తాన్ని ఒకే సైడ్‌కు పెట్టి ఫొటోకు పోజులిచ్చింది. ఇక బ్లాక్ కలర్ డ్రెస్‌లో ఉన్న ఆమె ట్రెండీగా దర్శనమిచ్చింది. ఇక ఈ పిక్స్ చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం ఆమె చాలా బాగుందని కామెంట్లు పెడుతుండగా మరికొందరు ఇంకో అమీ జాక్సన్‌లా తయారవుతున్నావు ఏంటి? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక ఆమె అభిమానులు మాత్రం అది జీక్యూ ఇండియా అనే మ్యాగజైన్ కోసమే ఈ ఫొటోషూట్ చేసిందని అంటున్నారు. ఇక ప్రస్తుతం సమంత పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.