తన సహ నటుడు నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న తర్వాత సమంత అతన్నించి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సోషల్ మీడియాలో తాను పడ్డ బాధనంతా వివరించే ప్రయత్నం చేసింది. ఆ క్రమంలోనే మయోసైటిస్ అనే ఒక వ్యాధి బారిన పడ్డ ఆమె నెమ్మదిగా కోలుకుంది. అయితే ఆమె సిటాడల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న సమయంలో ఆ సిరీస్ దర్శకులలో ఒకరైన రాజ్ నిడుమోరుతో డేటింగ్ చేస్తోంది అనే ప్రచారం జరిగింది. అయితే ఆ విషయం మీద అటు రాజ్ కానీ ఇటు సమంత కానీ స్పందించింది లేదు, అలా అని ఖండించింది కూడా లేదు.
MS Dhoni Political Entry: త్వరలో ఎంఎస్ ధోనీ పొలిటికల్ ఎంట్రీ.. ఏ పార్టీ నుంచంటే..?
అయితే తాజాగా సమంత కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఆమె పికిల్ బాల్ అనే ఒక స్పోర్ట్స్ కి సంబంధించిన టీం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆ టోర్నమెంట్ కి సంబంధించిన ఫోటో షేర్ చేయగా అందులో రాజ్ కూడా. ఉన్నాడు ఆ ఫోటోలలో ఒక ఫోటోలో సమంత రాజ్ చేతిని పట్టుకొని కనిపిస్తోంది దీంతో ఆమె డేటింగ్ రూమర్స్ మరింత విస్తృతమైనట్లే కనిపిస్తున్నాయి. గ్రూప్ తో కలిసి దిగిన ఫోటోలో సమంత రాజ్ చేతిని పట్టుకుని కనిపించడం అనేక చర్చలకు దారి తీస్తోంది. నిజానికి నాగచైతన్యతో విడాకులు కూడా రాజ్ డీకే డైరెక్ట్ చేసిన ఫ్యామిలీ మెన్ 2 సిరీస్ రిలీజ్ అయిన తర్వాత జరిగిన నేపథ్యంలో సమంత రాజ్ తో ప్రేమలో పడిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రాజ్ కి ఒక వివాహం జరగగా భార్య కూడా ఉన్నారు.