Site icon NTV Telugu

Samantha : సమంత, రాజ్ పై శ్యామలి మరో పోస్ట్‌ ..!

Samantha Raj

Samantha Raj

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ సమంత గురించి రోజుకో న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. మూవీస్ విషయం పక్కన పెడితే ఎక్కువగా తన వ్యక్తిగత విషయాలు ఏదో ఓ రూమర్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇక సామ్ రెండో పెళ్లికి సిద్ధమైనట్లు, దర్శకుడు రాజ్‌ నిడిమోరు తో ఆమె ప్రేమలో పడిందని, గత కొంతకాలంగా ఇద్దరూ డేటింగ్‌ చేస్తున్నారంటూ బాలీవుడ్‌, టాలీవుడ్‌ మీడియాలో వరుస వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. సమంత ఎక్కడ ఉంటే అక్కడ రాజ్ ఉంటున్నాడు.దీంతో నెట్టింట ఎక్కడ చూసినా వీరిద్దరి గురించే విపరీతంగా చర్చ నడుస్తోంది. ఈ రూమర్స్‌పై సమంతగానీ, రాజ్‌ గానీ ప్రత్యక్షంగా స్పందించలేదు.

Also Read : Jaya Krishna : బోల్డ్ డైరెక్టర్‌తో ఘట్టమనేని వారసుడి ఏంట్రీ..

కానీ రాజ్ నిడిమోరు భార్య శ్యామలి దే పెడుతున్న పోస్ట్‌లు చర్చకు దారితీస్తున్నాయి. తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. ‘మంచి కర్మను సృష్టించండి. ప్రజలకు సాయం చేయండి. అందరితో న్యాయంగా వ్యవహరించండి’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్టు పెట్టింది. అంతకు ముందు ‘నా గురించి మాట్లాడేవారికి.. నా తరఫున మాట్లాడేవారికి.. నేను చెప్పేది వినేవారికి.. నా గురించి వార్తలు వినేవారికి.. నా గురించి రాసే వారికి.. నా కోసం ఆలోచించేవారందరికీ దేవుడు ఆశీర్వాదం, ప్రేమ ఉండాలని కోరుకుంటున్నా’ అనే పోస్ట్‌ను ఆమె షేర్ చేసింది. మొన్నటి వరకు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేని శ్యామలి, సామ్‌-రాజ్‌ డేటింగ్‌ రూమర్స్‌ మొదలైనకానుండే సడన్ గా పోస్టులు పెడుతుంది. దీంతో ఆమె వీరిద్దరిని ఊదేశించే పెడుతున్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Exit mobile version