Site icon NTV Telugu

సలోని హీరోయిన్ గా కొత్త సినిమా షురూ

Saloni's Rajuku Nachchinde Rambha Movie shooting begins

చిన్న శ్రీశైలం యాదవ్ సమర్పణలో ‘రాజుకు నచ్చిందే రంభ’ పేరుతో దేవరపల్లి అఖిల్‌, వల్లాల ప్రవీణ్‌కుమార్‌ యాదవ్‌ (వెంకట్‌) ఓ సినిమాను నిర్మిస్తున్నారు. రావంత్‌ హీరోగా, ‘మర్యాద రామన్న’ ఫేమ్ సలోని హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ర్యాలి శ్రీనివాసరావు దర్శకుడు. ఆదివారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో మరో కథానాయిక కూడా ఉంటుందని, పాటలను చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి రాస్తున్నారని, అతి త్వరలోనే రఘు కుంచె సంగీత దర్శకత్వంలో పాటల రికార్డింగ్ ప్రారంభిస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు. దర్శకుడిగా తనకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ర్యాలి శ్రీనివాసరావు కృతజ్ఞతలు చెప్పారు.

Read Also : విడాకుల విచారంలో ఆమీర్! ‘దంగల్’ ఖాన్ కి ‘దబంగ్’ ఖాన్ ఓదార్పు!

Exit mobile version