బాలీవుడ్ స్టార్ హీరోలైన ముగురు ఖాన్స్ లో సల్మాన్ ఖాన్ ఒకరు. కానీ గత కొంత కాలంగా సరైన హిట్ లేక సళ్ళూ భాయ్ సతమతమవుతున్నాడు. పఠాన్ బ్లాక్ బస్టర్ అయినా అందులో జస్ట్ ఐదు నిముషాలు కనిపించే పాత్ర మాత్రమే. ఇక మురుగదాస్ డైరెక్షన్ లో ఎన్నో అంచనాలు పెట్టుకున్న సికిందర్ డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం గాల్వన్ అనే సినిమా చేస్తున్నాడు సల్మాన్. ఇది సల్మాన్ సినీ అప్డేట్. అయితే సల్మాన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్నివిస్తుపోయే విషయాలను పంచుకున్నాడు సల్మాన్.
Also Read : TheRajaSaab : రాజాసాబ్.. ట్రైలర్.. రెబల్ ఫ్యాన్స్ హ్యాపీగా లేరా.?
సినిమాలలో తన కండలతో విలన్స్ ను చిత్తు చిత్తు చేసే సల్మాన్ నిజజీవితంలో అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు సల్మాన్. గతంలో అనేక ఇంటర్వ్యూల్లో ఈ వ్యాధి గురించి చెప్పాడు. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ టాక్ షో ‘టూ మచ్ విత్ ట్వంకిల్ అండ్ కాజోల్’ టాక్ షోకు సల్మాన్ గెస్ట్ గా విచ్చేసాడు. ఈ టాక్ లో అనేక విషయాలను షేర్ చేసుకున్న సల్మాన్ తనకున్న వ్యాధి గురించి చెప్పాడు. నేను ట్రైజెమినల్ న్యూరల్జియా (టిఎన్) అనే వ్యాధితో కొన్నేళ్లుగా బాధను అనుభవిస్తున్నాను. ఈ వ్యాధి వల్ల ఆత్మహత్య ఆలోచనలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. దీనివల్ల కలిగే నొప్పిని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పాడు సల్మాన్. ఈ వ్యాధి వలన ముఖ భాగంలో విపరీతమైన నొప్పి వస్తుందట. మానవ శరీరంలోని ట్రైజెమినల్ అనే నాడిని ఈ వ్యాధి తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. చాలా కాలంగా ఈ అరుదైన వ్యాధితో సతమతమవుతున్నాడట.
