బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ప్రజంట్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. వరుస చిత్రాలతో వస్తున్నప్పటికి ఆయన రెంజ్ తగ్గ హిట్ లు మాత్రం పడటం లేదు. ఇదిలా ఉంటే తాజాగా సల్మాన్ ఓ షో లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్య పరిస్థితి, సినీ జీవితం పై ఎవ్వరికి తెలియని చాలా విషయాలు పంచుకున్నారు.
Also Read : SSMB 29 : మహేశ్ ఎంట్రీ సీక్వెన్స్ పై రాజమౌళి గ్రాండ్ ప్లాన్!
ముందు పెళ్లి విషయంలో తన అభిప్రాయాన్ని వెల్లడించిన సల్మాన్.. ‘వివాహం అంటే భావోద్వేగపరంగా, ఆర్థికపరంగా చాలా కఠినమైన అంశం. ఒక్క సంబంధాన్ని కొనసాగించడం అంత సులభం కాదు’ అని తెలిపారు. అలాగే తన ఆరోగ్య పరిస్థితిపై తొలిసారి స్పందించారు.. ‘ఒక నటుడిగా ఈ రంగంలో రాణించాలంటే మనమెంతో కష్టపడాల్సి ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు తరచూ గాయాలు అవుతుంటాయి. నాకు ట్రైజెమినల్ న్యూరల్జియా (ముఖ భాగంలో వచ్చే తీవ్రమైన నొప్పి), ఏవీ మాల్ఫోర్మేషన్ (రక్తనాళాల్లో నెలకొన్న అసాధారణ పరిస్థితి), బ్రెయిన్ ఎన్యోరిజమ్ (మెదడులో వచ్చే చిన్నపాటి నొప్పి). ఇవ్వని ఉన్నప్పటికీ వృత్తిపరంగా కాస్త విరామం తీసుకోవాలనే ఉద్దేశం మాత్రం నాకు లేదు. వీటితోనే జీవితాన్ని కొనసాగిస్తున్నాను. చిన్నతనం నుంచే ఇలాంటి సమస్యలు ఉంటే ఇప్పటికే దానిని అధిగమించేవాడిని. ఇప్పుడు వీటిని అధిగమించేందుకు నన్ను నేను రీస్టార్ట్ చేసుకుంటున్నా’ అని ఆయన పేర్కొన్నారు. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు.
