Site icon NTV Telugu

DilRaju : సల్మాన్ ఖాన్ హీరోగా దిల్ రాజు ఫిక్స్.. డైరెక్టర్ ఇతగాడే

Dil Raju

Dil Raju

తెలుగు చిత్ర పరిశ్రమలోని బడా నిర్మాతలలో ఒకరు దిల్ రాజు. నిర్మాతగా మాత్రమే కాదు పంపిణీదారనిగా కూడా దిల్ రాజు కింగ్ పిన్. నైజాం వంటి ఎరియాస్ లో థియేటర్స్ ను శాసించగల వ్యక్తి దిల్ రాజు. కానీ నిర్మాతగా దిల్ రాజు ఈ ఏడాది గట్టి ఎదురుదెబ్బ తిన్నాడు. శంకర్ డైరెక్షన్ లో వచ్చిన గేమ్ ఛేంజెర్ భారీ నష్టాలు తెచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం వంటి సెన్సషనల్ హిట్ వచ్చినా కూడా గేమ్ ఛేంజర్ నష్టాలను భర్తీ చేయలేని పరిస్థితి.

Also Read : Sankranthiki Vasthunnam : బాలీవుడ్ లోకి సంక్రాంతికి వస్తున్నాం.. హీరో ఎవరంటే?

ఇక నితిన్ తో చేసిన తమ్ముడు కూడా నష్టాలను తెచ్చింది. దాంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు దిల్ రాజు. ఈ గ్యాప్ లోనే మంచి కథలను సెట్ చేస్తూ క్రేజీ కాంబోను సెట్ చేసి సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా కోసం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశి పైడిపల్లి ఓ కథ రెడీ చేసారు. ఆ కథను సల్లూ భాయ్ కు వినిపించగా అందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసాడట. మిగిలిన విషయాలపై ప్రస్తుతం సల్మాన్ కు దిల్ రాజుకు మధ్య చర్చలు జరుగుతున్నాయట. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ ప్రాజెక్టు త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. తమిళ హీరో విజయ్ తో వారిసు సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన వంశి పైడిపల్లి ఇప్పుడు సల్మాన్ కోసం ఎలాంటి కథతో వస్తాడో ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి.

Exit mobile version