NTV Telugu Site icon

Saindhav Disease: సైంధవ్ సినిమాలో అరుదైన జబ్బు.. 16 కోట్ల ఇంజెక్షన్ కోసం టీడీపీ అభ్యర్ధన!

Spinal Muscular Atrophy

Spinal Muscular Atrophy

Saindhav Disease in Real life TDP urges Donations: టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ 75వ సినిమాగా తెరకెక్కిన సైంధవ్సినిమాలో ఒక అరుదైన జబ్బు బారిన పడిన తన పాపను కాపాడుకోవడానికి 17 కోట్ల రూపాయల ఇంజక్షన్ అవసరం పడుతుంది. మామూలు మధ్యతరగతి వ్యక్తిలా కనిపించే సైంధవ్.. అంత ఖరీదైన ఇంజక్షన్ తెచ్చి పాపను కాపాడుకోగలిగాడా.. అందుకోసం అతను ఏం చేశాడు.. చివరికి పాప బతికిందా లేదా అన్నది కథ. ఇదంతా సినిమా కథ అయితే నిజంగానే ఒక అరుదైన జబ్బుతో బాధ పడుతోంది. ముద్దులొలుకుతున్న తొమ్మిది నెలల చిన్నారికి ప్రాణాంతక వ్యాధి. అయితే ఒక్క ఇంజక్షన్ ద్వారా ఆ బిడ్డను బతికించుకోవచ్చు. కానీ వచ్చిన సమస్యల్లా ఆ ఇంజెక్షన్ ఖరీదు రూ.16 కోట్లు. ఒక మధ్యతరగతి కుటుంబానికి అంత స్తోమత ఉంటుందా? రాజమండ్రిలో ఉంటున్న ప్రీతమ్, గాయత్రి దంపతుల కూతురు హితైషి ‘స్పైనల్ మస్క్యూలర్ ఆట్రోఫీ’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతుంది.

Khushbu: “నా పెళ్లిలో ఆ హీరో గుక్కపెట్టి ఏడ్చాడు..” 24 ఏళ్ల తర్వాత నిజాన్ని బయటపెట్టిన ఖుష్బూ!

వెంటనే ఆ పాపకు ‘జొల్ జెన్ స్మా’ అనే ఇంజెక్షన్ ఇచ్చి చికిత్స చేయకపోతే ప్రాణాలు దక్కడం కష్టం. బిడ్డ పరిస్థితి తెలిసి తల్లడిల్లిన తల్లిదండ్రులు కూతురి ప్రాణాలు దక్కించుకోడానికి రూ.16 కోట్ల సాయం కోసం దాతలను ప్రాధేయ పడుతున్నారు. హితైషి విషయం తెలిసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొంత సాయం అందించేందుకు మాటిచ్చి… మిగిలిన సహాయం అందించి ఆదుకోవాల్సిందిగా ప్రజలకు, ఎన్జీవోలకు, కార్పొరేట్ సంస్థలకు పిలుపునిచ్చారు. కొంతమంది స్పందించి సహాయం అందించినప్పటికీ రూ.16 కోట్లు చాలా పెద్ద మొత్తం కావడంతో ఇంకా భారీగా సహాయం అందాల్సి ఉంది.

మరోవైపు పాప పరిస్థితి రోజురోజుకూ విషమిస్తుంది. కాబట్టి దాతలకు మరోసారి పిలుపునిస్తోంది తెలుగుదేశం. హితైషిని ఆదుకునేందుకు భారీ విరాళాలు అందించండి. ఇలాంటి వారికి క్రౌడ్ ఫండింగ్ సేకరించి ప్రత్యేకంగా అండగా నిలిచేందుకు ఇంపాక్ట్ గురు అనే వెబ్ సైట్ ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు. ఈ వెబ్ సైట్ వేదికగా అందించిన విరాళాలు నేరుగా ఆసుపత్రికి వెళ్తాయి. కాబట్టి https://impactguru.com/fundraiser/help-hithaishi… వెబ్ సైట్ కు వెళ్లి దాతలు హితైషి కోసం ఆర్థిక సాయం అందించవచ్చు, దాతలారా సహృదయంతో స్పందించి హితైషిని రక్షించుకునేందుకు తమ విరాళాలను అందించండి అని అంటూ టీడీపీ అధికారికంగా ప్రకటించింది.