NTV Telugu Site icon

Sail Ali Khan: సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్ ఎప్పుడు?

Saif Spine

Saif Spine

కత్తి దాడి ఘటనలో గాయపడిన నటుడు సైఫ్ అలీఖాన్ లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నటుడి ఆరోగ్యం ఎలా ఉందో, హాస్పిటల్ నుంచి ఎప్పుడు రిలీజ్ అవుతారో తెలుసుకోవాలని అభిమానులు అనుకుంటున్నారు. ఆసుపత్రి వైద్యులు నితిన్ డాంగే ఈ విషయాన్ని వెల్లడించారు. నటుడు దాడి జరిగిన అనంతరం సైఫ్ అలీఖాన్ ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ప్రమాదం నుంచి బయటపడ్డా, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈరోజు ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు లీలావతి ఆస్పత్రికి చెందిన డాక్టర్ నితిన్ డాంగే దీనికి సంబంధించి ఒక అప్‌డేట్ ఇచ్చారు. సైఫ్ అలీఖాన్‌ను ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయడం లేదని డాక్టర్ నితిన్ డాంగే అన్నారు. ఈ అంశం మీద మరో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నామని అన్నారు.

Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవ్ కి రివార్డు ఎంతంటే?

సైఫ్ ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు. ఇక నటుడిపై కత్తులతో పలుమార్లు దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేయగా, అతడిని మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్‌గా గుర్తించారు. నిందితుడు షెహజాద్ దొంగతనం చేయాలనే ఉద్దేశంతో నటుడి ఇంట్లోకి ప్రవేశించాడు. దాడి చేసిన వ్యక్తి మొదట ఇంట్లో పనిమనిషితో వాగ్వాదానికి దిగాడు. తర్వాత, శబ్దం విన్న సైఫ్ అలీఖాన్ అక్కడికి చేరుకోగా నటుడిపై దాడి చేయడం ప్రారంభించాడు. నటుడు సైఫ్ రక్తంలో తడిసి ఆసుపత్రికి వచ్చిన తీరు సింహంలా ఆసుపత్రికి వచ్చాడని డాక్టర్ అన్నారు. వారు పూర్తిగా రక్తంలో తడిసిపోయారు. కానీ, కొడుకుతో పాటు సింహంలా ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చాడు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉంద అని అన్నారు.