NTV Telugu Site icon

Saif Ali Khan: సైఫ్ మీద దాడి.. సస్పెన్స్ థ్రిల్లర్ కి తక్కువేం కాదు.. ఈ లాజిక్స్ మిస్సయ్యాయే!

Saif Ali Khan

Saif Ali Khan

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ మీద దాడి సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. అంత పెద్ద స్టార్ హీరో ఇంట్లోకి ఓ దొంగ వెళ్లి దాడి చేయడం వినడానికి విడ్డూరంగా అనిపిస్తుంది. ఎందుకంటే సైఫ్ అలీఖాన్ సాధారణ వ్యక్తి కాదు.. నవాబు కొడుకు. బాలీవుడ్ లో పేరుమోసిన యాక్టర్. వేల కోట్ల ఆస్తికి అధిపతి. చుట్టూ పదుల సంఖ్యలో సెక్యూరిటీ ఉంటుంది. పైగా అతనుండేది హై సెక్యూరిటీ ఉండే బాంద్రాలో. అందులో సైఫ్ బెడ్ రూం అపార్టుమెంట్ లోని చాలా పై అంతస్తులో ఉంటుంది. అక్కడికి చేరుకోవడం అంటే మామూలు మనుషులు సాధ్యం కాదు. పైగా ఆ దొంగ దాడి చేసింది తెల్లవారు జాముకు ముందు. ఇక్కడ చాలా విషయాలను గమనిస్తే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి.

అర్ధరాత్రి దాకా పార్టీ!!
సైఫ్ ఇంట్లో అర్ధరాత్రి దాకా పార్టీ జరిగింది. ఫ్రెండ్స్, కో యాక్టర్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అందులో ఉన్నారు. కాబట్టి సెక్యూరిటీ టైట్ గా ఉంటుంది. అలాంటప్పుడు ఆ దొంగ అక్కడి దాకా ఎలా చేరుకున్నాడు. పోనీ ఇంట్లో పనివాళ్లు హెల్ప్ చేశారేమో అనుకుంటే ఓ దొంగ పై అంతస్తు దాకా వెళ్తాడా.. కింద అంతస్తులో ఏదో ఒక విలువైన వస్తువులు తీసుకుని వెళ్లిపోవాలి కదా. పైకి వెళ్తే తాను పారిపోవడానికి వీలుండదని ఆ దొంగకు తెలియదా? పార్టీ అయిపోయిన వెంటనే సైఫ్ పడుకోలేదు. ఎందుకు అనేది తెలియదు. సైఫ్ చిన్న కొడుకు బెడ్ రూమ్ లో ఆ దొంగ కనిపించాడని అంటున్నారు.

ఓ దొంగతో పోరాడుతాడా?
ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే దొంగతో స్వయంగా సైఫ్ అలీ ఖాన్ ఫైట్ చేయడం. అంత పెద్ద యాక్టర్ తన ప్రాణాలను లెక్క చేయకుండా ఓ దొంగతో పోరాడుతాడా.. చుట్టూ సిబ్బందిని పెట్టుకుని అతనెందుకు అంత రిస్క్ చేసాడో తెలియదు. సైఫ్ మీద దాడి చేస్తుంటే చుట్టూ ఉన్న వాళ్లంతా ఏం చేస్తున్నారు. ఆ దొంగ దాడి చేసిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ దాకా ఎలా వచ్చాడు.. ఎలా పారిపోయాడు అనేది ఇంకా పెద్ద డౌట్. నిజంగానే ఆ దుండగుడు దొంగతనానికి వచ్చాడా? అనే అనుమానాలు ఇందులో ఎక్కువగా ఉన్నాయి.

సైఫ్ మీద దాడి చేయడానికే వచ్చాడా?
ఎందుకంటే ఓ దొంగ అంత పెద్ద యాక్టర్ ఇంట్లోకి వెళ్లేందుకు సాహసమే చేయడు. ఎందుకంటే టైట్ సెక్యూరిటీ ఉంటుంది. పైగా పెద్ద స్టార్ కాబట్టి పోలీసులు ఈజీగా పట్టేసుకుంటారనే విషయం ఆ దొంగకు తెలియదా? పైగా దొంగతనానికి వచ్చిన వాడు సైఫ్ మీద దాడి చేసేందుకు డేర్ చేస్తాడా.. హెల్పర్ అరవగానే పారిపోయేందుకు ప్రయత్నిస్తాడు. సైఫ్ వచ్చి పట్టుకునే దాకా ఎదురు చూడడు కదా. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే అసలు వచ్చిన వాడు దొంగతనానికి వచ్చాడా లేదంటే సైఫ్ మీద దాడి చేయడానికే వచ్చాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరి పోలీసులు ఏం చెప్తారో వేచి చూడాలి.