NTV Telugu Site icon

Sai Ronak : ఈనెల 18న బ్రహ్మాండమైన విడుదల కానున్న ‘రివైండ్’

First Look

First Look

సాయి రోనక్, అమృత చౌదరి హీరో హీరోయిన్లు గా క్రాస్ వైర్ క్రియేషన్స్ పై కళ్యాణ్ చక్రవర్తి నిర్మాతగా దర్శకుడిగా వస్తున్న సినిమా రివైండ్. ఆశీర్వాద్ సంగీతం అందించగా, శివ రామ్ చరణ్ సినిమాటోగ్రాఫర్ గా తుషార పాలా ఎడిటర్ గా పనిచేశారు. జబర్దస్త్ నాగి, కేఏ పాల్ రామ్, అభిషేక్ విశ్వకర్మ, ఫన్ బకెట్ రాజేష్, భరత్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. గతంలో ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు ఘనంగా జరిగింది. ఈనెల 18న ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు.

హీరోయిన్ అమృత చౌదరి మాట్లాడుతూ : బిగ్ స్క్రీన్ మీద నాకు ఇది ఫస్ట్ సినిమా. నాకే కాదు మా డైరెక్టర్ గారు, ఎడిటర్, సినిమాటోగ్రాఫర్ అందరికీ ఫస్ట్ సినిమా. స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. 18న సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు.

హీరో సాయి రోనక్ మాట్లాడుతూ : చిన్న టీం అయినా ఒక మంచి లైన్తో మంచి స్క్రిప్ట్ తయారుచేసుకొని ఈ సినిమాని చేసాం. మాకున్న బడ్జెట్, లైన్ అప్ తో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి కంటెంట్ ని తయారు చేశాం. డైరెక్టర్ కళ్యాణ్ గారు ఎన్.ఆర్.ఐ అయ్యుండి ఇక్కడికి వచ్చి డబ్బు పెట్టి మంచి కథతో సినిమాను తీయడం నిజంగా గర్వించదగ్గ విషయం. తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ ఉంటే కచ్చితంగా సినిమాను ఆదరిస్తారు. ఈనెల 18న ఈ సినిమాని విడుదల చేయబోతున్నాం. ప్రేక్షకులు అందరూ సినిమా చూసి సక్సెస్ చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాత, డైరెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ : ముందుగా మమ్మల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీడియాకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. టైం ట్రావెల్ మీద తీసిన లవ్, సై ఫై జోనర్ మూవీ. టైం ట్రావెల్ మీద వచ్చే సినిమాలు ఎప్పుడు సక్సెస్ అవుతాయి. ఈ మూవీ స్క్రీన్ ప్లే చాలా బాగా వచ్చింది. మా ఈ టైం ట్రావెల్ మీద తీసిన రివైండ్ మూవీ కూడా ప్రేక్షకులు అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు.

Show comments