Sai Pallavi: ఖాకీ డ్రెస్సులో సాయి పల్లవి మాస్ లుక్.. ‘ఓం’ గ్లింప్స్‌తో నెట్టింట రచ్చ!

Sai Pallavi

Sai Pallavi

Sai Pallavi: న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవిని ఇప్పటివరకు పక్కింటి అమ్మాయిలా, ఎమోషనల్ రోల్స్‌లోనే చూసిన ప్రేక్షకులకు ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయ్యే సర్‌ప్రైజ్ దక్కింది. ‘అమరన్’ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి, హీరో ధనుష్ కాంబోలో రాబోతున్న భారీ సినిమా ‘ఓం’. తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి ‘ఓం స్పెషల్ డ్యూటీ’ పేరుతో వదిలిన చిన్న వీడియో గ్లింప్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ఇందులో సాయి పల్లవి కనిపించిన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అవతారం చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ గ్లింప్స్‌లో సాయి పల్లవి ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ‘నిత్యారెడ్డి’ అనే ఫైర్‌బ్రాండ్ ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. మొదట ఏపీ పోలీస్‌లో అసిస్టెంట్ ఎస్పీగా బాధ్యతలు చూసిన ఆమె, ఆ తర్వాత ఇంటర్‌పోల్‌తో కలిసి డ్యూటీ చేసేందుకు సీబీఐ అడిషనల్ ఎస్పీగా ఎంట్రీ ఇచ్చారు.

నాయుడుపేటకు చెందిన నిత్యారెడ్డి, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన శ్రీధర్ రెడ్డి కూతురు. ఏపీలోని శేషాచలం అడవుల నుంచి తరలిపోతున్న ‘ఎర్ర బంగారం’ (ఎర్ర చందనం) స్మగ్లర్ల నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో పెకిలించేందుకు ఆమె రంగంలోకి దిగారు. “ప్రకృతికి వ్యతిరేకంగా జరిగే నేరమిది.. మన ఏపీ ఎర్ర బంగారంపై జరుగుతున్న దోపిడీ ఇది. ఈ రోజు గుర్తుపెట్టుకోండి.. స్మగ్లర్ల నెట్‌వర్క్ మొత్తాన్ని లేపేయడమే మన లక్ష్యం. ఈ ఆపరేషన్‌ను నేనే లీడ్ చేస్తున్నా, దీని పేరు ‘ఓం’ (OM)” అంటూ సాయి పల్లవి చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. జీపు దిగి గన్ గురిపెట్టడం, స్మగ్లర్లను చితక్కొట్టే సీన్స్‌లో ఆమె చూపించిన దూకుడు చూస్తుంటే థియేటర్లు దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తోంది. ధనుష్, మలయాళ దిగ్గజ నటుడు మమ్ముట్టి, సాయి పల్లవి కలయికలో వస్తున్న ఈ సినిమాకు సాయి అభ్యంకర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గ్లింప్స్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అభిమానులు నమ్ముతున్నారు.