సాయి పల్లవికి ఏమైంది… ఇదే ఇప్పుడు తమిళ తంబీల ఫీలింగ్. తన ప్రైవసీ తనదే కానీ మినిమం కర్టెసీ లేకపోతే ఎలా. మొన్న ఆ మధ్య కళా రంగంలో విశిష్ట సేవలందించిన వారికి తమిళ నాడు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే కళైమామణి అవార్డ్స్ ప్రకటించింది. సాయి పల్లవి, ఎస్ జె సూర్య, లింగుస్వామి, అనిరుధ్, మణికందన్, సింగర్ శ్వేతా మోహన్ ఇలా కొంత మందికి ఈ అవార్డ్స్ ప్రకటించింది. ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు చాలా మంది ప్రభుత్వానికి థాంక్స్ చెప్పారు. కానీ సాయి పల్లవి రెస్పాండ్ కాకపోవడంతో ఈ బుజ్జితల్లిపై గుర్రుగా ఉన్నారు.
Also Read : kanthara Chapter1 : కాంతార చాఫ్టర్ 1.. ఒకరోజు ముందుగా తెలుగు స్టేట్స్ లో ప్రీమియర్స్
ఈ మధ్య తమిళ తంబీలు సాయి పల్లవిని బాగా మిస్ అవుతున్నారు. అమరన్ తర్వాత ఆమె తమిళ ఫిల్మ్స్ ఏమి ఒప్పుకోవడం లేదు. రీసెంట్లీ శింబు 49 కోసం వెట్రిమారన్ ఆమెను సంప్రదించాడని సమాచారం. వెట్రిమారన్‌తో వర్క్ అంటే ఆఫర్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటారు హీరోయిన్స్. అలాంటిది వెట్రి ప్రస్తుతం శింబుతో చేస్తున్న సినిమా కోసం ఈ భానుమతిని అప్రోచ్ అయితే నో చెప్పిందన్న టాక్. దీంతో ఆమె కోలీవుడ్‌కు దూరం జరుగుతోందన్న డెసిషన్ కు వచ్చేస్తున్నారు ఆడియన్స్. ఈ ఏడాది తండేల్‌తో పలకరించిన బుజ్జితల్లి సాయి పల్లవి ప్రస్తుతం బీటౌన్‌లో బిజీగా మారిపోయింది. అమీర్ ఖాన్ కొడుకు హీరోగా వస్తున్నా ‘మేరే రహో’గాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అలాగే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రామాయణలో నటిస్తోంది. రామాయణ టూ పార్ట్స్ గా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇలా బాలీవుడ్ సినిమాలతో కోలీవుడ్ కు కావాలనే దూరంగా ఉంటోంది సాయి పల్లవి.
