నేచురల్ బ్యూటీ సాయి పల్లవి.. ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. డ్యాన్సర్‌గా తన కెరీయర్‌ను ప్రారంభించి ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో వరస పెట్టి సినిమాలు చేస్తోంది. తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను దక్కించుకుంది. ఇండస్ట్రీలో మిగత హీరోయిన్‌లకంటే పల్లవి పూర్తి భిన్నంగా ఉంటుంది.ఒక స్కిన్ షో చేయదు, మెకప్ వేయదు,బోల్డ్ సీన్స్ లో నటించదు. అందుకే ఆమె లెడీ పవర్ స్టార్‌గా గుర్తింపు సంపాదించుకుంది. తన నేచురల్ బ్యూటీతోనే సౌత్ ఆడియెన్స్‌ను కట్టిపడేసింది. హీరోయిన్లు అంటే అందానికి మాత్రమే ప్రతీక కాదని, తమలోనూ అబ్బురపరిచే టాలెంట్ దాగి ఉందని రాబోయే యంగ్ హీరోయిన్స్‌కు స్ఫూర్తిగానూ నిలుస్తోంది.
ఇక చివరగా ‘తండెల్’ మూవీతో అలరించిన ఈ అమ్మడు ప్రజంట్ బాలీవుడ్ ‘రామాయణ’ మూవీలో సీతగా నటిస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి.. ప్రేక్షకుల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది..‘నేను నా పాత్ర ఎంచుకునేటప్పుడు కథలో లోతెంత ఉంది.. నా పాత్రలో బలమైన భావోద్వేగం ఉందా? లేదా? అన్నది మాత్రమే చూసుకుంటా. ఎందుకంటే నా పాత్రల ద్వారా, ప్రేక్షకులకు నిజాయితీ గల కథల్ని చెప్పాలనేది నా ప్రయత్నం. నేను అనుకున్నట్లుగా ఆ పాత్రల తాలూకు భావోద్వేగాలతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారంటే అదే గొప్ప నాకు గొప్ప విజయంగా భావిస్తా. అందుకే నేనెప్పుడూ అవార్డుల కన్నా ప్రేక్షకుల ప్రేమను గెలుచుకోవడానికి తొలి ప్రాధాన్యమిస్తా. ఇక బాలీవుడ్ లో ‘రామాయణ’ చిత్రంతో హిందీ లోకి అడుగు పెట్టనున్నందుకు సంతోషంగా ఉంది.. అందులోను సీత పాత్రలో నటించడం గౌరవంగా ఉంది’ అని చెప్పింది సాయి పల్లవి.
