Site icon NTV Telugu

Sai Kumar: భయపెడుతున్న ‘ప్రణయగోదారి’ సాయికుమార్ లుక్‌!

Sai Kumar Pranayagodari

Sai Kumar Pranayagodari

Sai Kumar Look From Pranayagodaari Released: ఎటువంటి పాత్ర‌నైనా అవ‌లీల‌గా పోషించి, ఆ పాత్ర‌లోకి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి, వాటికి జీవం పోసి ప్రేక్ష‌కుల‌ను మెప్పించే న‌టుడు సాయికుమార్ ఇప్పటికే పలు సినిమాల్లో భయపెట్టే పాత్రలలో ఆకట్టుకున్న ఆయన మ‌రో ఫెరోషియ‌స్ పాత్ర‌తో ఆడియ‌న్స్‌ను స‌ర్‌ఫ్రైజ్ చెయ్య‌బోతున్నారు. `ప్ర‌ణ‌య‌గోదారి`లో సాయికుమార్ పెద‌కాపు అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రముఖ హాస్య‌న‌టుడు అలీ కుటుంబానికి చెందిన నటుడు సదన్ హీరోగా నటిస్తుండగా ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తోంది. సునీల్ రావినూతల ముఖ్య పాత్రలో నటిసున్న ఈ ‘ప్రణయగోదారి’ చిత్రాన్ని పిఎల్‌వి క్రియేషన్స్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్నారు.

Pourusham: ఆసక్తి రేపుతున్న “పౌరుషం – ది మ్యాన్ హుడ్” ట్రైలర్

ఇక సాయికుమార్ లుక్‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను శుక్ర‌వారం నాడు తెలంగాణ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ‘మా మునుగోడు ప్రాంతానికి చెందిన పారుమ‌ళ్ళ లింగ‌య్య ‘ప్ర‌ణ‌య‌గోదారి’అనే ఓ మంచి సినిమాను నిర్మించినందుకు అభినంద‌న‌లు, సినిమా రంగంలో ఆయ‌న‌కు మంచి భ‌విష్య‌త్ వుండాల‌ని కోరుకుంటున్నా, పారుమ‌ళ్ళ లింగయ్యకు నా స‌హ‌కారం ఎప్పుడూ వుంటుందని అన్నారు. “చూడ‌గానే గంభీరంగా క‌నిపించే లుక్‌లో..రౌద్రంగా క‌నిపంచే మీస‌క‌ట్టు, తెల్ల‌ని పంచె, లాల్చీతో, మెడ‌లో రుద్రాక్ష‌మాల‌, చేయికి కంక‌ణంతో..చేతిలో సిగార్‌తో… చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఈ పోస్ట‌ర్‌లో క‌నిపిస్తున్న సాయికుమార్‌ ఈ సినిమాలో తన పాత్ర ఎంత శ‌క్తివంతంగా వుంటుందో అనిపించేలా కనిపిస్తున్నారు. స‌ద‌న్‌, ప్రియాంక ప్ర‌సాద్‌, సాయికుమార్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం మార్కండేయ, కెమెరా: ఈద‌ర ప్ర‌సాద్‌ అందించారు.

Exit mobile version