నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ ఎగువ, దిగువ అహోబిలంలో మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ సందడి చేశారు. అహోబిల నరసింహ స్వామిని దర్శించుకున్న మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్, స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పండితుల చేత ఆశీర్వాదం తీసుకొని , నవ నరసింహుల చిత్రపటం , తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ఇక అనంతరం మెగా అభిమానులకు స్వామి వారి గెస్ట్ హౌస్ లో సెల్ఫీలు, ఫొటోలు ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సాయి దుర్గ తేజ్ అహోబిల క్షేత్రానికి రావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. స్వామి వారిని దర్శించుకోవడం ఆనందంగా , ప్రశాంతంగా ఉంది అని పేర్కొన్న ఆయన ప్రతి ఒక్కరు స్వామి వారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు.
Re-release: స్వీట్ మెమోరీస్ పుట్టుకొస్తున్న ‘నా ఆటోగ్రాఫ్’
సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగ్ జరుగుతుంది…నాకు రాజకీయాలతో పని లేదు ప్రస్తుతానికి ఈ పూటకు భోజనం చేస్తే చాలు అనుకుంటా… నలుగురికి సహాయం చేస్తూ , సినిమాలు చేసుకుంటూ , ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటా అని అన్నారు. చరిత్ర కలిగిన అహోబిల క్షేత్రం చాలా అద్భుతంగా ఉంది అని పేర్కొన్న ఆయన ప్రతి హీరో అభిమానులను ఒకటే కోరుతున్న డ్రైవింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి అని అన్నారు. నాకు యాక్సిడెంట్ జరిగిన ఆ రోజు హెల్మెట్ పెట్టుకున్న కాబట్టే ఈరోజు మీ ముందు ఇలా ఉన్నా అని ఆయన అన్నారు. డ్రగ్స్ మత్తు పదార్ధాలకు దూరంగా ఉండి ఏదైన గేమ్స్ ఆడండి అని అన్నారు.