NTV Telugu Site icon

Sai Dharam Tej: పవన్ కళ్యాణ్ కాళ్లపై పడ్డ ధరమ్ తేజ్

Sai Dharam Tejj

Sai Dharam Tejj

వెండి తెరపైకి వచ్చి దశాబ్దం పూర్తయిన సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శుభాభినందనలు తెలియచేశారు. నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న సాయి దుర్గా తేజ్ ఎంతో సామాజిక బాధ్యతతో మెలగడం సంతోషదాయకం అని పవన్ కళ్యాణ్ అన్నారు. సాయి దుర్గా తేజ్ గురువారం సాయంత్రం మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ని కలిసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “నటన పట్ల ఎంతో తపనతో ఎదుగుతూ వస్తున్నాడు సాయి తేజ్. నటుడిగా తొలి అడుగులు వేసినప్పుడు నుంచి సహ నటులు, సాంకేతిక నిపుణులు పట్ల ఎంత గౌరవ మర్యాదలతో ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడు. ప్రతి విషయం పట్ల శ్రద్ధాసక్తులు కనబరుస్తాడు. అదే విధంగా తను ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు కూడా ఎంతో ఆత్మ విశ్వాసం చూపించాడు. తనకు ఎదురైన పరిస్థితి మరెవరికీ రాకూడదనే ఆలోచనతో రహదారి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఎలాంటి జాగ్రత్తలు వహించాలో చైతన్యపరుస్తున్నాడు.

Allu Arjun: పవన్ కళ్యాణ్ డేరింగ్.. నా లైఫ్ లో నేను చూసింది ఆయన్నే.. అల్లు అర్జున్ ఊహించని కామెంట్స్

సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడేవారు, పోస్టులు పెట్టడంపై బలంగా స్పందిస్తున్న తీరు సాయి దుర్గా తేజ్ లోని సామాజిక బాధ్యతను తెలియచేస్తోంది. ఇటీవల విజయవాడలో జల విపత్తు సంభవించినప్పుడు తన వంతు బాధ్యతగా స్పందించాడు. కథానాయకుడిగా మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను” అన్నారు. సాయి దుర్గా తేజ్ మాట్లాడుతూ “చిన్న మామయ్య ఆశీర్వాదం పొందడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. నా కెరీర్ కు మార్గదర్శిగా ఉన్నారు. చిన్నతనం నుంచి నాకు కళ్యాణ్ మావయ్యతో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. స్కూల్లో చదివేటప్పుడు టెన్నిస్ ఆడేవాణ్ణి. ఒక టోర్నమెంట్ లో ఓడిపోయాను. ఇక ఆడను అని టెన్నిస్ రాకెట్ పక్కన పడేస్తే కళ్యాణ్ మావయ్య మోటివేట్ చేశారు. నీ ప్రయత్నంలో ఎలాంటి లోపం లేదు. ఆటల్లో గెలుపోటములు సహజం. గెలిచే వరకూ ప్రయత్నించాలి అని చెప్పి మరో టోర్నమెంట్ కు పంపించారు. ఆ టోర్నీలో గెలిచాను. అప్పుడు మావయ్య బలంగా హత్తుకుని ముద్దు పెట్టారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తి నన్ను ముందుకు తీసుకువెళ్తోంది” అన్నారు.

Show comments