ప్రియుడిని పెళ్లాడిన ‘సాహో’ బ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్ “సాహో” చిత్రంలో జెన్నిఫర్ పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ ఎవెలిన్ శర్మ తాజాగా తన ప్రియుడిని పెళ్లాడింది. తన చిరకాల ప్రియుడు డాక్టర్ తుషాన్ భిండితో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన ఈ ఇండో-జర్మన్ నటి ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. వీరి వివాహం ఆత్మీయుల మధ్య ఆస్ట్రేలియాలో జరిగినట్టు తెలుస్తోంది. ఎవెలిన్ శర్మ, డాక్టర్ తుషాన్ భిండి 2019లో నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్థానికి ముందు ఒక ఏడాదికి పైగా వీరిద్దరూ లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. తుషాన్ ఆస్ట్రేలియాలో డెంటల్ సర్జన్ గా పని చేస్తున్నారు. నిశ్చితార్థం జరిగినప్పటి నుండి ఎవెలిన్ ఆస్ట్రేలియాలోనే ఉంటోంది. ఇక ఈ బ్యూటీ తన పెళ్లి గురించి మాట్లాడుతూ “బెస్ట్ ఫ్రెండ్‌ను వివాహం చేసుకోవడం కంటే మంచి అనుభూతి లేదు. మా జీవితాన్ని కలిసి గడపడం పట్ల మేము చాలా సంతోషిస్తున్నాము” అంటూ తన పెళ్లిపై సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం నెట్టింట ఎవెలిన్ శర్మ-తుషాన్ భిండి పెళ్లి ఫోటోలు వైరల్ గా మారాయి.
Also Read
తాజావార్తలు
-
Bihar: విద్యార్థి నిరసనకారులపైకి AK-47.. జిల్లా ఎస్పీపై వేటు..
-
Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
-
Congress: “జ్ఞానేశ్ కుమార్ను అమెరికాకు తీసుకెళ్లండి”.. ట్రంప్ ప్రశంసలపై కాంగ్రెస్ కౌంటర్..
-
Tamil Nadu: ‘ఆ చర్య సిగ్గుగా ఉంది’.. త్రిషకు సీఎం విజయ్ సెల్యూట్ చేయడంపై డీఎంకే ఆగ్రహం
-
Rishabh Pant Record: టెస్టుల్లో 100 సిక్సర్లు.. పంత్ పేరిట ప్రపంచ రికార్డు!
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!