NTV Telugu Site icon

‘వకీల్ సాబ్’పై రూమర్లు… క్లారిటీ ఇచ్చిన మేకర్స్

Rumours about Vakeel Saab Release in OTT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ కమ్ బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గత శుక్రవారం (ఏప్రిల్ 9) విడుదలై ప్రేక్షకులతో పాటు విమర్శకులను కూడా మెప్పించింది. హిందీ బ్లాక్ బస్టర్ ‘పింక్’ రీమేక్ గా రూపొందిన ఈ చిత్రంలో పవన్ లాయర్ పాత్రలో నటించారు. ప్రస్తుతం వంద కోట్ల కలెక్షన్స్ వైపు పరుగులు పెడుతున్న ఈ చిత్రం త్వరలోనే ఓటిటిలో విడుదల కానుందనే రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా ఈ రూమర్లకు చెక్ పెట్టారు మేకర్స్. ‘రూమర్లను నమ్మకండి. థియేటర్లోనే ‘వకీల్ సాబ్’ను చూడండి. ఇప్పట్లో ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ లో ‘వకీల్ సాబ్’ విడుదల కాదు’ అని తెలుపుతూ పోస్టర్ ను విడుదల చేశారు. కాగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో అంజలి, అనన్య, నివేదా థామస్, ప్రకాష్ రాజ్ లు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. బోణీకపూర్ సమర్పణలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.